Monthly Archives: July 2016

ప్రవాహం

1
దుర్మార్గాన్ని  ఎంతని ఎదిరించినా
ఒక చెడ్డ పని మరో చెడ్డ మనికి దారులు వేస్తుంది
ఏటిగట్టు మీద నడకలా

2
కోసిన ధాన్యం కంటికి మురిపమే ఆ పూటకి
నాగలి మోసిన సంచులన్నీ ఇల్లు చేరకముందే
నిర్జీవంగా వ్రేళ్ళాడుతున్న కొడవళ్ళు

3
నిత్యం హోలీ ఆడుతున్న గ్రీజు మొహాలు
నవ్వు అంటే ఆగని మోటారు చక్రమే !

4
అందరు చేసేది వ్యాపారమే
తల్లి చేతిలో పెరిగి
ఆ తల్లి చావును వెతుకుట ధౌర్భాగ్యమే !

5
మతాలని మోస్తూ
హితాలని మరచి
భూతాలను పెంచుతూ
దేవుడు మావాడని బుద్ధిజీవుల అల్లరి !
ఆ నీటిలో చేపకు
కొండ మీద కోతికి
మరి ! ఆ చెట్టుపైన పక్షికి దేవుడేవరు ?

కృష్ణ మణి

IMG-20160712-WA0001

‘ఆటాడుకుందాం రా’ ఆడియో ఆగ‌స్టు 5న 

సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటాడుకుందాం.. రా’. సుశాంత్ స‌ర‌స‌న సోన‌మ్ బ‌జ్వా న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.అనూప్‌ రూబెన్స్‌ సంగీతం
అందించిన ఈ సినిమా ఆడియో ఆగ‌స్టు 5న విడుద‌ల కానుంది. ఈ చిత్రం ఆగ‌స్టు 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

FB_IMG_1469940172353

” తక్కువే కదా మరి “

 

ముభావమెక్కువై ఎండి ఎడారైపోయిన నా ముఖం,
తడిసిన ముంగిరులు నీ ముఖంపై రాల్చే ముత్యదారలకి మెల్లగా జీవతడిని నింపుకుంటుంది..

మరింత ఎడబాటు తప్పదేమోనని
మందగించిన కణాలన్నీ
ఒక్కొక్కటిగా
వేగానికి బానిసలవుతున్నపుడే తెలుస్తుంది
నీ ఛాయకీ, నా చూపుకీ సఖ్యత కుదిరిందని…

నిన్ను చూస్తుండిపోయినప్పుడు
ఉనికి కోల్పోయిన కాలం
నన్ను బ్రతిమాలుకుంటుంది,
నువ్వు చూపులు సడలిస్తేనే
నా కర్తవ్యానికి నేను న్యాయం చేయగలనని..మిగిలిన లోకంపై ముసిగేసి
నీ అందంతెచ్చిన ఈ అంధకారంలో
ఎదురయ్యే రంగులుతో పోటీపడాలనుకునే
హరివిల్లులపై ఎంత జాలిపడినా తక్కువే మరి…

Satish sisti

received_1032034370251083

బంతిపూల జానకి ఆడియో విడుదల

‘ ఉజ్వల క్రియేషన్స్ ‘ పతాకం పై, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం లో కల్యాణి-రాం
నిర్మాతలుగా నిర్మించిన “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లగా నటించారు.
బోలె సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జరిగింది.ఈ వేడుక శుక్రవారం రాత్రి శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. తొలి సీడీని హీరో రామ్ ఆవిష్క‌రించి..ఆకాష్ పూరి, నందిని రెడ్డిలకు అందించారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ సాంగ్స్ అన్నీ బావున్నాయి. బోలెగారు మంచి సంగీతం అందించారు.ధ‌న‌రాజ్ ఇలాంటి సినిమాల‌ను చాలా చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శ‌కురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ధ‌న‌రాజ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఇంకా మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ, చాల కాలం  నుంచి నేను బోలె గారు మంచి స్నేహితులం.ఆయన సంగీతం చేసిన అన్ని  చిత్రలకి నేను పాటలు రాస్తున్నాను.ఈ చిత్రానికి అన్ని పాటలు రాసే అవకాశం కల్పించిన చిత్ర దర్శక నిర్మాత ల కి ధ‌న్య‌వాదాలు. ఆడియోలానే సినిమా కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ధ‌న్‌రాజ్ మాట్లాడుతూ
చిరంజీవి గారిపై వున్న అభిమానంతో తాడేప‌ల్లిగూడెం నుండి పారిపోయి హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డికి వ‌చ్చాక‌ డ‌బ్బులు అయిపోవడంతో హోట‌ల్‌లో ప‌ని చేశాను. డైరెక్ట‌ర్ తేజ‌ జై సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చారు. సుకుమార్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌డం చిత్రంలో ఓ క్యారెక్ట‌ర్ చేశాను. అప్పుడే రామ్‌ ప‌రిచ‌య‌మ‌య్యారు. నా కొడుకుకి ఎనిమిదోనెల డ‌బ్బులు లేవు ఎవ‌రినీ అడ‌గాలో తెలియ‌లేదు. రామ్‌గారిని అడిగితే ప‌దివేలిచ్చారు. త‌ర్వాత నా పెళ్లిరోజు వ‌చ్చిన‌ప్పుడు సుకుమార్‌గారు కొంత డ‌బ్బులిచ్చారు. అందుకే నాకొడుక్కి సుక్‌రామ్ అనే పేరు పెట్టాను. అదే ప‌రిచ‌యంతో నేను నిన్న రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఆడియో ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌ని పిలిచాను. ఆయ‌న అన్న‌మాట ప్ర‌కారం వ‌చ్చారు. నా లైఫ్‌లో సుకుమార్‌గారిని, రామ్‌గారిని మ‌ర‌చిపోలేను.నేను కేవ‌లం హీరోగానే చేస్తాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. రెండు సీన్స్ ఉన్న సినిమా అయినా చేస్తాను . మ‌ధ్య‌ మ‌ధ్య‌లో బంతిపూల జానకి వంటి సినిమాలు చేస్తుంటాను. బోలె  సంగీతం చాలా బాగుంది అన్నారు.

ముఖ్య అతిధి హీరో రామ్ మాట్లాడుతూ ధ‌న్‌రాజ్‌ చాలా క‌ష్టాలు దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. సినిమా మంచి స‌క్సెస్ సాధించాలి.  ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌కు, నిర్మాత‌లు స‌హా ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌.
బోలె మంచి సంగీతాన్ని ఇచ్చారు. పాట‌లు, సినిమా పెద్ద విజ‌యం సాధించాలి అన్నారు.
చిత్ర నిర్మాత  మాట్లాడుతూ
పూర్తి వినోదం పంచే చిత్ర‌మిది. అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం.ఇందుకు సహకరించిన మా హీరో ధ‌న్‌రాజ్‌ మంచి ప్రోత్సాహాన్నిచ్చారు. ద‌ర్శ‌కుని ప‌నిత‌నం చాల బాగుంది, స‌హ‌క‌రించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

ద‌ర్శ‌కుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ మా హీరో ధ‌న్‌రాజ్‌ మంచి ప్రోత్సాహాన్నిచ్చారు.చిత్ర షూటింగ్ అంతా అందంగా జరిగింది.ఈ చిత్రం ఇంత బాగ రావడానికి చిత్ర నిర్మాత సహకారం చాల వుంది. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.
రెజీనా, నందినీ రెడ్డి, అభిరాం దగ్గుబాటి, రాజ్ కందుకూరి,రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, అదుర్స్ ర‌ఘ, సిద్ధు, సురేష్ కొండేటి, సంపూర్ణేష్ బాబు, సాయిరాజేష్, తనీష్, డార్లింగ్ స్వామి, తదితరులు ఆడియో వేడుక‌లో పాల్గొన్నారు.

unnamed

” సింధూర ” పాటల రికార్డింగ్‌

అశోక్ రాయల్, అవంతిక, కీర్తిక హీరోహీరోయిన్లుగా సాయి సింధు క్రియేషన్స్ బ్యానర్ పై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింధూర ‘.
ఈ సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం ఇటీవల శ్రీచక్రస్టూడియోలో పూర్తి అయింది మొత్తం 6పాటలు వున్నయి . సాకేత్ సాయి రామ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
తన మొదటి సినిమా నుండి ఎందరో నూతన నటీనటులను,గాయని గాయకులను,సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన చిత్ర దర్శకనిర్మాత పులిఅమ్రుత్ ఈ చిత్రం లోను ప్రతిభ వున్న కొత్త వారిని చిత్ర పరిశ్రమ కి పరిచయం చేస్తు ప్రోత్సహిస్తున్నరు.
‘ శ్రీవర్శ్ ‘ అనే ప్రతీభ కలిగిన నూతన గాయకూడిని ఈ చిత్రం ద్వార పరిచయం చేస్తున్నరు.
తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : అమర్ నాథ్,విశ్వనథ్, ఎడిటింగ్ : సురేష్ గుల్లపెలి్్ల.. పాటలు : వీరేంద్ర, జి.వి.మురళీకృష్ణ, పి.ఎన్.ఆర్ ముని, పులి అమృత్.

FB_IMG_1469776241816

FB_IMG_1469772804500

FB_IMG_1469776248131

” నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నిన్ను ప్రేమించాలంటే…

” నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నిన్ను ప్రేమించాలంటే…

అరచేతిలో అదృష్ట రేఖలు, అరికాలి కింద నక్షత్రాలు ఉండనవసరం లేదు…

తను ప్రేమించగలిగేలా నువ్వు నిజాయతీగా బతికితే చాలు…

అయినా అదృష్టం ఉంటే అమ్మాయిలు ప్రేమించడం కాదు…

వాళ్ళు ప్రేమించడమే అదృష్టం…”

#నీ_బంగారం

Vaalee

IMG-20160726-WA0002

సద్యోజాతప్రియభామినీం పరశివాం శ్రీవిద్యతత్త్వాత్మికాం
వ్యక్తావ్యక్తతత్త్వాత్మికాం పరశివాం శ్రీచక్రయంత్రాత్మికాం
అభయానందదాయినీం పరశివాం కామ్యార్ధసిద్ధిప్రదాం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

images

SIVOHAM(SAAYAME DAIVAM) INDEPENDENT FILM PREMIERE

“One who helps others is no less than the God himself.” Based on the same point, we present our independent film SIVOHAM. Request you to bless us with your gracious presence on the eve of the screening of our SIVOHAM.

VENUE: PRASAD LABS, BESIDE L.V.PRASAD EYE CARE, JUBILEE HILLS.
DATE AND TIME: 31ST JULY 2016 Sunday 6:00 PM

Your presence is our blessing and your support is our strength..
Regards,
Gangadhar Advaitha
శివోహం (సాయమే దైవం) (ఇండిపెండెంట్ సినిమా 55 mnts only)ప్రదర్శన
“సాటి మనిషి కి సాయం చేసినవారు ఎవరైనా దైవం తో సమానం.” ఈ సత్యo ఆధారంగా మేము రూపొందించిన ఇండిపెండెంట్ చిత్రం “శివోహం”.దర్శకులు
గంగాధర్ అద్వైత మాట్లాడుతు
మా ఈ చిత్రoతో మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నాం. మీరు తప్పకుండ వస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.. అన్నారు

వేదిక: ప్రసాద్ లాబ్స్, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి పక్కన, జూబిలీ హిల్స్.
తేది మరియు సమయం: జూలై 31, 2016 ఆదివారం సా:6:00 గం||ల కు..IMG-20160728-WA0006

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న మరో బయంకరమైన హారర్ చిత్రం 21

సన్ ఫ్లవర్ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఫిలిమ్స్, అవుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘21′ జైశంకర్ చిగురుల దర్శకత్వంలో యాదగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేఖ్ వాలింబే సంగీతం అందించిన ఈ సినిమా  ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
చిత్ర దర్శకులు జైశంకర్ చిగురుల మాట్లాడుతూ ఇది హారర్ మూవీ. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు.పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు , ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది.ఈ చిత్రాన్ని జూలై 29న విడుదలకు సిద్దమైంది. ప్రేక్షకులు ఈ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు.

received_857966447681597

received_857966447681597

శ్రీ గణేశ స్తోత్రం (సామవేదోక్తం)

1) ఖర్వం లంబోదరం స్ఠూలం జ్వలంతం బ్రహ్మతేజసా |
గజవక్త్రం మహానిర్వాణ మేకదంతమనంతకం ||

2) సిద్ధానాం యోగినామేవ జ్ఞానినాంచ గురోర్గురుం |
ధ్యాతం మునీంద్రైర్దేవేంద్రైఃబ్రహ్మేసాశేషసమ్జకైః ||

3) సిద్ధేంద్రైర్మునిభిః సద్భిర్భగవంతం సనాతనం |
బ్రహ్మస్వరూపం పరమం మఙ్గలం మఙ్గలాలయం ||

4) సర్వవిఘ్నహరం శాంతం దాతారం సర్వసంపదాం |
భవాబ్ధిమాయా పోతేవ కర్ణధారంచ కర్మిణాం ||

5) శరణాగత దీనార్త పరిత్రాణాయ పరాయణం |
ధ్యాయేద్ధ్యానాత్మకం సాధ్యం భక్తేశం భక్తవత్సలం ||

6) పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం ||

7) సురాసురేంద్రైః సిద్ధేంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మదినేశం చ గణేశం మఙ్గలాలయం ||

8) ఇదం స్తోత్రం మహాపుణ్యం విఘ్నశోకహరంపరం |
యః పఠేత్ప్రాతరుద్థాయ సర్వవిఘ్నాత్ప్రముచ్యతే ||

ganapathy