” నేనున్నాను ” (నాలుగవ రోజు కథ)

ఏమి చెప్పాలో అర్ధం కాక తల పట్టుకుంటూ కిటికీ లోంచి బయటకి చూసాడు ‘వాసు’ కారిడార్ లో ‘శిల్ప’ నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. షాక్ తో చూస్తుండిపోయాడు ‘వాసు’…
‘వాసు’ తన రూమ్ లో కుర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు సాయంకాలమే డిశ్చార్జి అయి వచ్చాడు. ‘రాజ’ అన్ని జాగర్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పడుకోవాలంటేనే తనకి ఓ విధమైన భయం అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది చాల అసహనంగా వుంది. ‘ఎందుకిలా జరుగుతోంది, రెండు ఏండ్ల నుండి వెంటాడుతున్న కల ఇప్పుడు కళ్ళ ముందు వస్తావంలా ఎలా కనిపిస్తోంది? ఏమిటి దీనికి పరిష్కారం?’ ఎంత ఆలోచించినా అతనికి అర్ధం కావడం లేదు. బుర్ర బాగా వేడెక్కి పోయింది.
నిద్ర పోకుండా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు. రాత్రి ఒంటి గంట అయ్యింది, తన సెల్ మోగింది, లిఫ్టు చేసాడు, అవతలి నుంచి పరిచయం వున్న ఆడ గొంతు పలుకరించింది. అలెర్టు అయ్యాడు. ‘ ఏంటి సర్ ఇంకా నిద్రపోలేదు..? అసలే మీ ఆరోగ్యం బాగా లేదు, ఇలా నిద్ర మేలుకుంటే ఎలా?’ అందామె, క్షణకాలం స్టన్ అయ్యాడు ‘వాసు’ వెంటనే కోలుకుని, “ప్లీజ్ మీరు ఫోన్ పెట్టేయకండి, నేను చెప్పేది వినండి, నేను టెన్షన్ భరించలేకుండా వున్నాను ప్లీజ్..” అని ప్రాదేయపడ్డాడు. ఆమె నవ్వుతూ ‘సరే చెప్పండి’ అంది కూల్ గా, ” అసలు మీరెవరు…? రెండేళ్లుగా కలలో వెంటాడుతున్నారు..? తీరా ఇప్పుడు వాస్తవం లోకి కుడా వచ్చి నన్ను ఫాలో చేస్తున్నారు? అసలు ఇది ఎలా సాధ్యం అవుతోంది? నా మానసిక స్థితి లో ఏదైనా మార్పు వచ్చిందా? నేనేమైనా భ్రమలో బతుకుతున్నానా? అర్ధం కావడం లేదు, అసలేం జరుగుతోంది..? దయచేసి చెప్పండి.”.
‘వాసు’ గొంతు బోగురుపోయింది, తెలియకుండానే సన్నగా ఏడుపు తన్నుకు రాసాగింది. ‘సార్, ప్లీజ్ కూల్…మీరలా ఫీల్ అవకండి, మీకేమీ అవలేదు మీరు మానసికంగా కుడా చాలా ఆరోగ్యంగా వున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో మిమ్మల్ని ఫాలో చెయ్యడం లేదు, మీరు నా ప్రాణం, మీరే నా జీవితం’ ఆమె చెబుతూ వుంటే నమ్మలేనట్టుగా వినసాగాడు ‘వాసు’.
‘సార్ ఒక్కసారి టూ ఇయర్సు వెనక్కి వెళ్ళండి, మీరు ఊటీ లో ఆర్టు ఎక్షిబిషన్ అటెండ్ అయినప్పుడు, జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి దయచేసి, అప్పుడు మీకు అంతా క్లియర్ అవుతుంది, నేను మల్లీ ఫోన్ చేస్తాను బాయ్ టేక్ కేర్’ అంటూ ఫోన్ పెట్టేసింది ‘వాసు’ పిలుస్తున్నా వినిపించుకోకుండా…’వాసు’ ఇరిటేట్ అవుతూ , వచ్చిన నెంబర్ కి తిరిగి కాల్ చేసాడు….నాట్ రీచబుల్ అని వచ్చింది. కోపంగా ఫోన్ ని బెడ్ మీద పడేసాడు. తలపట్టుకుని ఆమె చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏమీ గుర్తుకు రావడం లేదు…చాలాసేపు బాగా మదనపడ్డాడు.
‘తాను అసలు ఊటీ కి ఎప్పుడు వెళ్ళాడో గుర్తుకు రావడం లేదు, నేనసలు ఊటీ ఎందుకు వెళ్ళాను? అక్కడ ఎగ్జిబిషన్ ఎప్పుడు జరిగిందీ?’ ఏమీ గుర్తుకు రావడం లేదు.’ లేచి అటూ ఇటూ తిరిగాడు, మంచినీళ్ళు తాగాడు, ఈలోపు కిటికీ తలుపు గాలికి కొంచెం తెరుచుకుంది…కొంచం వేగంగా గాలి లోపలి వచ్చింది కిటికీ ఎదుగుండా వున్న సెల్ఫు లోని పాత పేపర్లు ఎగిరి కింద పడ్డాయి…అది చూసి ‘వాసు’ కిటికీ మూసి గొళ్ళెం పెట్టాడు.
పడిపోయిన కాగితాలని ఎరుతుండగా ఒక ట్రైన్ టికెట్ కనిపించింది, తీసి చూసాడు, అది తానూ రెండేళ్ళ క్రితం ఊటీ నుంచి ప్రయాణం చేసిన టికెట్..అది చూసి కాన్ఫ్యుజ్ అవుతూ లేచి మంచం మీద కూర్చున్నాడు…గట్టిగా కళ్ళు మూసుకున్నాడు…

మిగతా భాగం రేపు…
మీ బోయనపల్లి రమణ (రచయిత)