Daily Archives: June 17, 2016

శని త్రయోదశి

(రేపు శని త్రయోదశి)
శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిచినవారికి శుభాలనొసగుతాడనీ ‘ఏలిననాటి శని దశ’ వారిని అంతగా బాధించదనీ పురాణాలు చెబుతున్నాయి.
ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ‘ శనీశ్వరుడు ‘గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు,శనైశ్చరుని భక్తితో కొలిచినవారికి శుభాలనొసగుతాడనీ ‘ఏలిననాటి శని దశ’ వారిని అంతగా బాధించదనీ పురాణాలు చెబుతున్నాయి.

శనయే క్రమతి సః… నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. శనిగ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం 24 గంటలు. అంత నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ని ‘మందుడు’ అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో ఏడోవాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడని ప్రతీతి.
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శనివారం…శనేశ్వరుడు
“శని” భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
*తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
* ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
* వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
*శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనేE స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
*వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
*ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
* ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం, ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలిమద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.
ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.IMG-20160617-WA0001

భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం |

imagesచంద్రార్కానలభాసమానముఖాం శ్రీచక్రమధ్యస్థితాం

నానారత్నమణిమాణిక్యభూషితాం సుధాసముద్రవాసినీం

ఆగమనిగమశాస్త్రసన్నుతాం కాదిహాదిస్వరూపిణీం

భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్