Monthly Archives: June 2016

అల్లరి నరేష్‌తో జాహ్నవి ఫిలిమ్స్ చిత్రం

కామెడీ చిత్రాల కథానాయకుడిగా మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు అల్లరి నరేష్‌ హీరోగా త్వరలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ తాజా చిత్రానికి ప్రముఖ రచయిత, నటుడు కృష్ణభగవాన్‌ కథ, మాటలు అందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు. ‘అలాఎలా’ చిత్ర విజయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ..’వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే హీరో అల్లరి నరేష్‌తో ‘కెవ్వుకేక’ చిత్రం తర్వాత మా బ్యానర్‌లో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత కృష్ణభగవాన్‌ అందించే కథ, మాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నరేష్‌ బాడీ లాగ్వేంజ్‌కి సరిపోయే వైవిధ్యమైన కథ ఇది. తొలి చిత్రం ‘అలాఎలా’తో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల అభినందనలు అందుకున్న అనీష్‌కృష్ణ తప్పకుండా ఈ చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దుతాడనే నమ్మకం ఉంది. సెప్టెంబర్‌ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తాము…అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్‌, కథ-మాటలు: కృష్ణభగవాన్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీష్‌కృష్ణ.

IMG-20160629-WA0010

త్వరలోనే విడుదల కానున్న “నిన్నే కోరుకుంటా”

శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై విజయ్‌భాస్కర్‌, సందీప్, ఆనంద్‌, పూజిత మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ (వినయ్‌) నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ..‘‘ఇది రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తుంది. నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి..చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు.పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు , ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. అతి త్వరలో నే సినిమాని విడుదల చేస్తున్నాము అన్నారు.

విజయ్‌భాస్కర్‌, సందీప్, ఆనంద్‌, పూజిత, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, సారిక, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస,చమ్మక్ చంద్ర, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్‌ చౌదరి,అప్పారావు మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి

IMG-20160628-WA0005

 

గ్రామీణ నేపథ్యంలో మరో ప్రేమకథా చిత్రం

వీరు పిక్చర్స ‌ పతాకంపై అనురూప్ శామిలి జంట‌గా,
స్వీయ దర్శకత్వంలో వి శంకర రూపొందించిన చిత్రం ‘సొంత ఊరిలో’. గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రం గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వ‌ర‌లో టీజ‌ర్ ని, ఆడియో ని విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

గ్రామీణ నేపథ్యంలో గతంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా తమ చిత్రం ఉంటుందని ఎక్కువ భాగం షూటింగ్ హిందూపురం,అనంతపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసామని తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేసీ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్శక నిర్మాత వి శంకర
చెప్పారు. పూర్తి వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూసేలా తమ చిత్రం ఉంటుందన్నరు.ఈ చిత్రానికి యశ్వన్తనాగ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

FB_IMG_1467093734872

” నేనున్నాను ” (నాలుగవ రోజు కథ)

ఏమి చెప్పాలో అర్ధం కాక తల పట్టుకుంటూ కిటికీ లోంచి బయటకి చూసాడు ‘వాసు’ కారిడార్ లో ‘శిల్ప’ నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. షాక్ తో చూస్తుండిపోయాడు ‘వాసు’…
‘వాసు’ తన రూమ్ లో కుర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు సాయంకాలమే డిశ్చార్జి అయి వచ్చాడు. ‘రాజ’ అన్ని జాగర్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పడుకోవాలంటేనే తనకి ఓ విధమైన భయం అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది చాల అసహనంగా వుంది. ‘ఎందుకిలా జరుగుతోంది, రెండు ఏండ్ల నుండి వెంటాడుతున్న కల ఇప్పుడు కళ్ళ ముందు వస్తావంలా ఎలా కనిపిస్తోంది? ఏమిటి దీనికి పరిష్కారం?’ ఎంత ఆలోచించినా అతనికి అర్ధం కావడం లేదు. బుర్ర బాగా వేడెక్కి పోయింది.
నిద్ర పోకుండా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు. రాత్రి ఒంటి గంట అయ్యింది, తన సెల్ మోగింది, లిఫ్టు చేసాడు, అవతలి నుంచి పరిచయం వున్న ఆడ గొంతు పలుకరించింది. అలెర్టు అయ్యాడు. ‘ ఏంటి సర్ ఇంకా నిద్రపోలేదు..? అసలే మీ ఆరోగ్యం బాగా లేదు, ఇలా నిద్ర మేలుకుంటే ఎలా?’ అందామె, క్షణకాలం స్టన్ అయ్యాడు ‘వాసు’ వెంటనే కోలుకుని, “ప్లీజ్ మీరు ఫోన్ పెట్టేయకండి, నేను చెప్పేది వినండి, నేను టెన్షన్ భరించలేకుండా వున్నాను ప్లీజ్..” అని ప్రాదేయపడ్డాడు. ఆమె నవ్వుతూ ‘సరే చెప్పండి’ అంది కూల్ గా, ” అసలు మీరెవరు…? రెండేళ్లుగా కలలో వెంటాడుతున్నారు..? తీరా ఇప్పుడు వాస్తవం లోకి కుడా వచ్చి నన్ను ఫాలో చేస్తున్నారు? అసలు ఇది ఎలా సాధ్యం అవుతోంది? నా మానసిక స్థితి లో ఏదైనా మార్పు వచ్చిందా? నేనేమైనా భ్రమలో బతుకుతున్నానా? అర్ధం కావడం లేదు, అసలేం జరుగుతోంది..? దయచేసి చెప్పండి.”.
‘వాసు’ గొంతు బోగురుపోయింది, తెలియకుండానే సన్నగా ఏడుపు తన్నుకు రాసాగింది. ‘సార్, ప్లీజ్ కూల్…మీరలా ఫీల్ అవకండి, మీకేమీ అవలేదు మీరు మానసికంగా కుడా చాలా ఆరోగ్యంగా వున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో మిమ్మల్ని ఫాలో చెయ్యడం లేదు, మీరు నా ప్రాణం, మీరే నా జీవితం’ ఆమె చెబుతూ వుంటే నమ్మలేనట్టుగా వినసాగాడు ‘వాసు’.
‘సార్ ఒక్కసారి టూ ఇయర్సు వెనక్కి వెళ్ళండి, మీరు ఊటీ లో ఆర్టు ఎక్షిబిషన్ అటెండ్ అయినప్పుడు, జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి దయచేసి, అప్పుడు మీకు అంతా క్లియర్ అవుతుంది, నేను మల్లీ ఫోన్ చేస్తాను బాయ్ టేక్ కేర్’ అంటూ ఫోన్ పెట్టేసింది ‘వాసు’ పిలుస్తున్నా వినిపించుకోకుండా…’వాసు’ ఇరిటేట్ అవుతూ , వచ్చిన నెంబర్ కి తిరిగి కాల్ చేసాడు….నాట్ రీచబుల్ అని వచ్చింది. కోపంగా ఫోన్ ని బెడ్ మీద పడేసాడు. తలపట్టుకుని ఆమె చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏమీ గుర్తుకు రావడం లేదు…చాలాసేపు బాగా మదనపడ్డాడు.
‘తాను అసలు ఊటీ కి ఎప్పుడు వెళ్ళాడో గుర్తుకు రావడం లేదు, నేనసలు ఊటీ ఎందుకు వెళ్ళాను? అక్కడ ఎగ్జిబిషన్ ఎప్పుడు జరిగిందీ?’ ఏమీ గుర్తుకు రావడం లేదు.’ లేచి అటూ ఇటూ తిరిగాడు, మంచినీళ్ళు తాగాడు, ఈలోపు కిటికీ తలుపు గాలికి కొంచెం తెరుచుకుంది…కొంచం వేగంగా గాలి లోపలి వచ్చింది కిటికీ ఎదుగుండా వున్న సెల్ఫు లోని పాత పేపర్లు ఎగిరి కింద పడ్డాయి…అది చూసి ‘వాసు’ కిటికీ మూసి గొళ్ళెం పెట్టాడు.
పడిపోయిన కాగితాలని ఎరుతుండగా ఒక ట్రైన్ టికెట్ కనిపించింది, తీసి చూసాడు, అది తానూ రెండేళ్ళ క్రితం ఊటీ నుంచి ప్రయాణం చేసిన టికెట్..అది చూసి కాన్ఫ్యుజ్ అవుతూ లేచి మంచం మీద కూర్చున్నాడు…గట్టిగా కళ్ళు మూసుకున్నాడు…

మిగతా భాగం రేపు…
మీ బోయనపల్లి రమణ (రచయిత)

” నేనున్నాను ” (మూడవ రోజు కథ)

“అసలు ఏమి జరుగుతోంది నా చుట్టూ ” అనుకుంటూ, ఇన్ కమింగ్ నెంబర్ ని చూసి, ఆ నెంబర్ కి తిరిగి డైల్ చేసాడు. ‘దిస్ నెంబర్ టెంపర్ రర్లీ అవుట్ ఆఫ్ ఆర్డర్’ అని వస్తోంది….’వాసు’ గుండెల్లో సన్నగా నెప్పి మొదలైంది.
‘వాసు’ కళ్ళు తెరిచేసరికి, తను ఎక్కడ ఉన్నాడో ? కాసేపు అర్ధం కాలేదు. అతనికి అంతా మసగ్గా కనిపిస్తోంది. ఈలోగా అతని నుదిటిపై ఒక చేయి వెచ్చగా తాకింది. కళ్ళు నులుముకుని బలవంతంగా కళ్ళు తెరిచాడు. ” ఎలా వుంది ఇప్పుడు? ” అనే తీయనైన గొంతు వినిపించింది. తల తిప్పి చూసాడు, ముందు ఎవరా? అనుకున్నాడు, తర్వాత ఆమెను పోల్చుకున్నాడు. ” ఈవిడ ఆవిడే? రోజూ తనకొచ్చే కలలో తను చిత్రించే అందమైన అమ్మాయే…రోజూ తనకొచ్చే కలలో రౌడీలు తరిమేది ఈ అమ్మాయినే, ఇంతకు ముందు ఫోన్ చేసి రక్షించినందుకు థాంక్సు చెప్పిన అమ్మాయే, మై గాడ్ ఏంటి ఇదంతా? కలలో కనిపించే అమ్మాయి కళ్ళముందుకు రావడం ఏమిటి? ” అనుకుంటూ తల పట్టుకుంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నం చేసాడు….కానీ లేవలేక పోతాడు. ఆ అమ్మాయి ‘వాసు’ ను పట్టుకుని లేపి కుర్చోపెట్టింది. ‘ఎలా వుంది ఇప్పుడు?’ మళ్ళీ అడిగింది ఆమె. ‘వాసు’ అయోమయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

” ఏంటి సర్ అడుగుతుంటే ఏమీ మాట్లాడారు? మీకేదైనా ఇబ్బందిగా ఉందా..? చెప్పండి. మీకు సేవ చేయడానికే నేను ఇక్కడ వున్నాను. ఐ యాం యువర్ అసిస్టెంట్ నౌ, మీరు డిశ్చార్జి అయ్యే వరకూ మీకు అన్ని విధాల సహాయంగా వుండటం నా డ్యూటీ, చెప్పండి సర్ ఎనీ ప్రాబ్లం?? ” అడిగింది ఆమె నవ్వుతూ.
‘వాసు’ కి మతి పోయింది. ” మీరెవరు? నేనెక్కడ వున్నాను..? డిశ్చార్జి అవటం ఏంటి..? నాకంతా అయోమయంగా వుంది.” అన్నాడు. “ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫు, బీ కూల్, ఈ రోజు తెల్లవారు జామున మీరు మీ రూమ్ లో స్పృహ కోల్పోయి పడిపోయి వుండగా, మీ స్నేహితిడు ‘రాజా’ చూసి మిమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేసారు. ఇది ‘రాంలీలా హాస్పిటల్’, మీకు ట్రీట్ మెంట్ జరిగింది, ఇప్పుడు స్పృహ లోకి వచ్చారు. ఎదో చూడకుదని సంఘటన మీరు చూసినట్టు వుందని దాక్టర్ చెప్పారు, మీరేమీ కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. ” అంది కూల్ గా, ‘వాసు’ బుర్ర గోక్కుని, మీరెవరు..? ఇక్కడ ఏమి చేస్తున్నారు..? అని అడిగాడు. ఆమె నవ్వుతూ ” నేను ఇక్కడ నుర్సు ని నాపేరు ‘శిల్ప’.” అని చెబుతూ వుండగా ఆ రూమ్ లోకి డాక్టర్, ‘వాసు’ ఫ్రెండ్ ‘రాజు’ లు ఎంటర్ అయ్యారు.

‘ఎరా ఎలావుందిప్పుడు?’ అని అడుగుతూ ‘వాసు’ దగ్గరికి వచ్చి అతని భుజం పై చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు ‘రాజు’, ‘ఓకే’ అన్నట్లు తలూపాడు ‘వాసు’ డాక్టర్ వచ్చి ‘వాసు’ పల్సు చూసి, ‘నో ప్రాబ్లెం, నార్మల్ గానే వుంది మిస్టర్ వాసు రాత్రి నీకేదైనా పీడ కల వచ్చిందా?’ అని అడిగాడు. జరిగింది చెప్పలేక తనలోనే మదన పడుతూ, ‘గుర్తుకు లేదు డాక్టర్’ అన్నాడు చిన్నగా ‘వాసు’. ‘ఇట్స్ ఒకే బాగా స్ట్రెస్ ఆవడం వల్ల ఇలా జరిగింది, ఓ టూ డేస్ రెస్టు తీసుకుంటే సరిపోతుంది, నేను నర్సుని పంపిస్తాను, ఆవిడ మీకు మెడిసిన్ ఇస్తుంది, సాయంకాలం మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు’. అని నర్సు ని కేకేసాడు డాక్టర్. అప్పుడు గుర్తుకు వచ్చి , అంతకు ముందు తనకు సపర్యలు చేసిన నర్సు ‘శిల్ప’ ఎక్కడ అని చూసాడు ‘వాసు’ ఆ రూమ్ లో డాక్టర్, రాజు లు తప్ప ఎవరూ లేరు.

కొంచం కాన్ఫ్యుజ్ అవుతూ ‘ ఇప్పుడేగా మీ నర్సు ‘శిల్ప’ నాతో మాట్లాడుతూ ఇక్కడే వుంది, జరిగినది అంతా తను నాకు చెప్పింది’ అన్నాడు. దానికి డాక్టర్ ‘ నర్సా? శిల్పానా? అలాంటి పేరుగల వాళ్ళు ఇక్కడెవరూ లేరే, మీరింకా ఎదో ట్రాన్సు లో ఉన్నట్టున్నారు, మీ రూమ్ కి ఫస్టు మేమే వచ్చాం, నైట్ డ్యూటీ నర్సు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో నర్సు వస్తుంది. అసలు ‘శిల్ప’ అన్న పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ ఏ డిపార్టుమెంట్ లోనూ పనిచెయ్యడం లేదు, మీరు రిలాక్షు అవ్వండి ముందు’ అంటూ రూమ్ నుంచి బయటకి నడిచాడు డాక్టర్. తిరిగి కన్ఫ్యూజన్ లో పడ్డాడు ‘వాసు’, ‘ ఏమైంది రా…? నర్సు ఏంటి..? ‘శిల్ప’ ఏంటి..?’ అని ‘రాజు’ అడిగాడు.

ఏమి చెప్పాలో అర్ధం కాక తల పట్టుకుంటూ కిటికీ లోంచి బయటకి చూసాడు ‘వాసు’ కారిడార్ లో ‘శిల్ప’ నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. షాక్ తో చూస్తుండిపోయాడు ‘వాసు’…
నాలుగవ భాగం రేపు…
మీ బోయనపల్లి రమణ ( రచయిత )

” అమీర్ పేట్ లో” ఆడియో జూలై 17 న

శ్రీ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ” అమీర్ పేట్ లో”. ‘పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ నిర్మిస్తున్నారు. ‘శ్రీ’కి జంటగా ‘ అశ్విని’ నటిస్తోంది. ఈ చిత్రం టైటిల్ తోనే అధ్బుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ రెస్పాన్స్‌తో సినిమాను రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తోన్న టీమ్ తాజాగా ఆడియో విడుదల తేదీని ప్రకటించేసింది.మురళి లియోన్
సంగీతం దర్శకత్వంలో రూపొందిన ఆడియోను జూలై 17 న పెద్ద ఎత్తున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

received_1118510758215086

” నేనున్నాను ” (రెండవరోజు కథ)

దుండగులు ఆ అమ్మాయిని లాక్కొని వెళ్తున్నారు, కన్ఫ్యూజన్ నుంచి ఇంకా బయటపడలేదు ‘వాసు’, ఆ అమ్మాయి ‘వాసు’ నే చూస్తూ రక్షించమని అరుస్తోంది. ‘వాసు’ ఒక్కసారిగా తల విదిల్చి దుండగులు బలవంతంగా లాక్కుని వెళ్తున్న ఆమె వేపు వేగంగా పరిగెత్తాడు.

ఆ అమ్మాయిని లాక్కుని వెళ్తున్న దుండగులను ఆటకాయించాడు ‘వాసు’. ‘ ఆమెను వదలమని ‘ వారికి వార్నింగ్ ఇచ్చాడు. దుండగులు కోపంగా ‘వాసు’ మీద దాడికి దిగారు, ‘వాసు’ లేని శక్తి ని కూడగట్టుకుని వారితో పోరాడసాగాడు. నలుగురిని ఎదుర్కోవడానికి ‘వాసు’ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ఒక దుండగుడు లావాటి కర్ర తీసుకుని ‘వాసు’ తలపై బలంగా కొడతాడు. దాంతో వాసు తల పగిలి రక్తం విరజిమ్మింది. ‘వాసు’ గావు కేక పెట్టి కుప్పకూలి పోయాడు.

దబ్బున మెలుకువ వచ్చింది ‘వాసు’ కి. నిద్రలోంచి లేచి కూర్చున్నాడు, టైం చుస్తే తెల్లవారుజామున నాలుగున్నర అవుతోంది. లేచి బాటిల్ తీసుకుని నీళ్ళు తాగాడు ఆపకుండా, అతని శరీరం చమటతో తడిచిపోయింది. వెళ్లి మంచం మీద కూర్చున్నాడు తలపట్టుకుని. ఈ కల ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గత రెండు ఏళ్లుగా ప్రతి రోజూ వస్తోంది. ఒకే కల ఇంత కాలంగా ప్రతి రోజూ రావడం ‘వాసు’ కి అంతుపట్టడం లేదు.

తనకే ఇలా జరుగుతుండటం ‘వాసు’ కి భయాన్ని కలిగిస్తోంది, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక పోతున్నాడు, తనని పిచ్చివాడు అనుకుంటారేమో ? అన్న అనుమానంతో.

‘వాసు’ కి రక్తసంబందీకులు ఎవరూ లేరు, చాలా తక్కువమంది స్నేహితులు తప్ప. చిన్నప్పుడే ‘వాసు’ తల్లిదండ్రులు యాక్షిడెంట్ లో చనిపోయారని ఎవరో చెప్పగా విన్నాడు అంతే. కనీసం తన అమ్మా , నాన్నల రూపు కుడా తనకి గుర్తుకు లేదు. ఎక్కడో తిన్నాడు, ఎలాగో బ్రతికాడు. చదువు లేదు, కానీ భగవంతుడు అతనికి చిత్రకళ అనే అద్భుతమైన మేధస్సును ఇచ్చాడు. ఆ కళతోనే ‘వాసు’ సమాజంలో జీవిచాగాలిగాడు. ఇప్పుడు నలుగురూ గుర్తించగలిగే స్థాయికి ఎదిగాడు. సొసైటీ అతనికి ఒక మంచి పేరు వుంది. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడూ ఒంటరితనం అనేది మాత్రం అతని మనసుని తొలుస్తూనే వుంటుంది.

‘వాసు’ కి ఏమీ అర్ధం కావడం లేదు, ‘పోనీ ఎవరినైనా సైక్రియాటిస్ట్ ని కలిస్తే ఎలా వుంటుంది…?’ అన్న ఆలోచన మొదటిసారి కలిగింది ‘వాసు’ కి. వెంటనే ఫోన్ చేసి ఒక ఫ్రెండ్ కి విషయం చెప్పాలని అనుకుంటూ సెల్ తీసి డయల్ చేయబోతూ వుండగా, అతని సెల్ మ్రోగింది. చూస్తే అది అన్నోన్ నెంబర్, ‘ఎవరబ్బా ఈ టైం లో?’ అనుకుంటూ లిఫ్టు చేసాడు, ‘హలో ఎవరండీ?’ అని అడిగాడు, అవతల నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది, ” మీకు చాలా థాంక్స్ అండీ, ఇందాక బీచ్ లో మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు..మీ ఋణం ఎలాగైనా తీర్చు కుంటాను, బాయ్ ” అని ఫోన్ పెట్టేసింది.

ఒక్క సారిగా షాక్ కి గురై అలాగే ఉండిపోయాడు ‘వాసు’. చాలా సేపటివరకూ మామూలు మనిషి కాలేకపోయాడు. “అసలు ఏమి జరుగుతోంది నా చుట్టూ ” అనుకుంటూ, ఇన్ కమింగ్ నెంబర్ ని చూసి, ఆ నెంబర్ కి తిరిగి డైల్ చేసాడు. ‘దిస్ నెంబర్ టెంపరర్లీ అవుట్ ఆఫ్ ఆర్డర్’ అని వస్తోంది….’వాసు’ గుండెల్లో సన్నగా నెప్పి మొదలైంది.

మూడవ భాగం రేపు…
మీ బోయనపల్లి రమణ ( రచయిత )

IMG-20160626-WA0000

” నేనున్నాను…”

మిత్రులారా ఒక నాలుగు రోజుల సీరియల్ రాయాలని ఈ రోజే మొదలుపెట్టాను సీరియల్ పేరు ” నేనున్నాను “.

” నేనున్నాను…” (మొదటి రోజు)

సమయం సరిగ్గా సాయంకాలం నాలుగు గంటలు కావొస్తోంది. అది సముద్ర తీర ప్రాంతం. సాయంకాలపు షికారుకి వచ్చిన జనాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతోంది. సముద్రుడు తన అలలతో అక్కడికి వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలుకరిస్తున్నాడు. ఆ సమయంలోనే ఒక యువకుడు అక్కడికి వచ్చాడు, అతని పేరు ‘వాసు’ అతనో మంచి చిత్రకారుడు. ‘వాసు’ తనతో పాటు తెచ్చుకున్న డ్రాయింగ్ స్టాండ్ ఒక చోట వుంచి, దానిపైన పాడ్ అమర్చాడు. సముద్రం నుంచి వస్తున్న గాలికి స్టాండ్ పడిపోకుండా జాగర్తలు తీసుకున్నాడు. బాగ్ లోనుంచి కావలసిన మెటీరియల్ బయటకు తీసాడు. రంగులు జాగర్తగా కలిపాడు…ఓ సారి సముద్రం వేపు చూసాడు. పాడ్ మీద బొమ్మ వేయడం మొదలు పెట్టాడు..ఆ క్షణం నుంచి అతను పరిసరాలను మరచిపోయ్యాడు. తదేకంగా తను అనుకున్న బొమ్మ వేయడంలో నిమగ్నమై పోయాడు.
సమయం ఆరు గంటలు కావొస్తోంది, సన్నని చీకట్లు కమ్ముకోసాగాయి. అప్పటికే ‘వాసు’ గీయాల్సిన బొమ్మ పూర్తి అయ్యింది. క్షణ కాలం ఆగి బొమ్మని ఒకసారి తృప్తిగా చూసుకున్నాడు. అది ఒక అందమైన అమ్మాయి బొమ్మ, ఆ అమ్మాయి అందాన్ని మాటల్లో వర్ణించలేము. అంత ఆద్భుతంగా ఉందా చిత్రం.
ఈలోగా అతని వెనకాల కాస్త దూరంగా ఎదో అలికిడి వినిపించింది. ఆ అలికిడికి వాస్తవం లోకి వస్తూ తిరిగి చూసాడు. ఒక యువతి పరిగెత్తుకుంటూ వస్తోంది, ఆమెని నలుగురు దుండగులు తరుముతూ వస్తున్నారు. ఆ యువతీ స్పీడ్ గా పరిగెత్తుకుని వచ్చి ‘వాసు’ ని అడ్డు చేసుకుంటూ దాక్కో సాగింది, ‘వాసు’ కి అయోమయంగా అనిపించింది. ఈలోపు ఆమెని తరుముతున్న నలుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ‘వాసు’ వెనక దాక్కున్న ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ, ” ఏయ్ మర్యాదగా లొంగిపో, నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ” అంటారు, ఆ మాటలకి ఆమె మరింత భయపడుతూ ‘వాసు’ ని గట్టిగా పట్టుకుంది. అది చూసిన ఒక దుండగుడు ‘ రేయ్ నువ్వేమైనా సినిమాలో హీరో అనుకుంటున్నావా? వదిలేయ్ ఆ అమ్మాయిని లేకుంటే నీకూ పెళ్లి అవుతుంది ‘.. అనగానే ‘వాసు’ ఏమీ అర్ధం కాని పరిస్థిలో దిక్కుతోచక వాళ్ళనే చూడసాగాడు. ఈ లోగా ఆ దుండగులు వారిద్దరిపై దాడి చేసారు…’వాసు’ గీసిన బొమ్మని లాగి చించి పాడవేస్తారు…స్టాండ్ ని , రంగులనీ చిందర వందర చేసారు..అప్పటిదాకా ఆ అమ్మాయిని సరిగా గమనించని ‘వాసు’ ఆమెని చూసి షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు అంతకు ముందు తను గీసిన బొమ్మలోని అమ్మాయే…
దుండగులు ఆ అమ్మాయిని లాక్కొని వెళ్తున్నారు, కన్ఫ్యూజన్ నుంచి ఇంకా బయటపడలేదు ‘వాసు’, ఆ అమ్మాయి ‘వాసు’ నే చూస్తూ రక్షించమని అరుస్తోంది. ‘వాసు’ ఒక్కసారిగా తల విదిల్చి దుండగులు బలవంతంగా లాక్కుని వెళ్తున్న ఆమె వేపు వేగంగా పరిగెత్తాడు……..(సశేషం)
రెండవభాగం రేపు…..
మీ బోయనపల్లి రమణ ( రచయిత )

FB_IMG_1466864198779

‘ బంతిపూల జానకి ’ సెన్సార్ పూర్తి

‘ ఉజ్వల క్రియేషన్స్ ‘ పతాకం పై, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం లో కల్యాణి-రాం
నిర్మాతలుగా నిర్మించిన “బంతిపూల జానకి” సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు
పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా
చాలా బావుంది అని ప్రశంసించారు. ఈమధ్య కాలంలో ఈలాంటి కామెడీ ఎంటర్ టైనర్
చూడలేదని, చాల చక్కగా సినిమాని తీర్చిదిద్దారని అన్నారు. సినిమా తప్పని సరిగా
విజయం సాధిస్తుందని వారు అన్నారు.

ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో
ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేస్తూ తమ
ఆనందాన్ని ” పినాకినీ డాట్ కాం “తో పంచుకుంది.

ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లగా నటించిన ఈ చిత్రం లో, అదుర్స్ రఘు,
చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్,
జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కెమెరా : జి.ఎల్. బాబు, సంగీతం : భోలే, ఎడిటింగ్ : డా. శివ వై. ప్రసాద్,
పాటలు : కాసర్ల శ్యాం, కథ – మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్లు : సూపర్ ఆనంద్,
ఆర్టు డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిజినేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి – రాం.
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : నెల్లుట్ల ప్రవీణ్ చందర్.IMG-20160624-WA0063

రీరికార్డింగ్‌లో ఆది, వీరభద్రమ్‌ల ‘చుట్టాలబ్బాయి’

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఒక పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా రీరికార్డింగ్‌ జరుగుతోంది.
ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ – ”చాలా ఎక్స్‌లెంట్‌ సబ్జెక్ట్‌ ఇది. వీరభద్రమ్‌ ప్రతి సీన్‌ చాలా బాగా తీస్తున్నారు. అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది” అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ – ”ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి థమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఆడియో ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా ఆడియోను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ – ”ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆదికి మరో మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

IMG-20160624-WA0059