Monthly Archives: May 2016

‘కొత్త కొత్తగా వున్నది’ ఆడియో విడుదల తేదీ ఖరారు

సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సతీష్ గుండేటి దర్శకత్వంలో పెర్లా ప్రభాకర్, తోట గోపాల్ రూపొందించిన చిత్రం ‘కొత్త కొత్తగా వున్నది’.ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం జూన్‌
4వ తారీఖున ఖరారు చేశారు .సినిమా ఫస్ట్ లుక్ ను అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పలువురి ప్రముఖు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు .
దీనిపై దర్శకులు సతీష్ గుండేటి స్పందిస్తూ.. చిత్ర ఆడియోను జూన్‌ 04వ తేదీలోపు ముగించేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఆ దిశగానే పనులు సాగుతున్నాయి. దీంతో జూన్‌ 04 ఆడియో విడుదల కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం. అందరూ సంతోషపడేలా ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.IMG-20160531-WA0000

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతున్ని అర్చిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమంతుడు రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్,బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.

ఆంజనేయస్వామి అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు , సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురి స్తుందనీ అలా అలంకరిస్తారు.ఇంకొక విషయం తెలుసా ఆంజనేయ స్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.
ఆంజనేయాయనమః అనే మంత్రంతో పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. ఆంజనేయ ఆలయాలను సందర్శించు కోవడం పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడిగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట. ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట.

ఒళ్ళంతా సింధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను అని చెప్పాడు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. images

వైశాఖం ఫస్ట్‌లుక్ విడుదల

హరీష్ (ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్), అవంతిక హీరో హీరోయిన్లుగా ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ చిత్రాల దర్శకురాలు బి జయ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’. ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ నేడు విడుదలైంది. ఈ సందర్భంగా బి జయ మాట్లాడుతూ ‘‘60 శాతం చిత్రీకరణ పూర్తైంది. ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని లొకేషన్లలో సినిమా చేయాలని కజకిస్థాన్‌లో షూట్ చేశాం. తొలిసారిగా కెమెరా విభాగంలో రోబొటిక్ టెక్నాలజీ వాడుతున్నాం. గత సినిమాల్లానే ‘వైశాఖం’ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని’’ అన్నారు.

చిత్ర‌ నిర్మాత బి.ఎ.రాజ మాట్లాడుతూ…జ‌య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్ గా సూప‌ర్ హిట్స్ అయ్యాయి. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌లో జ‌య ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు . ల‌వ్ లీ కోసం ట‌ర్కీలో తీసిన రెండు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈసారి వైశాఖం చిత్రం పాట‌ల‌కు కొత్త లోకేష‌న్స్ కి వెళ్లాల‌ని ఎన్నో కంట్రీస్ లోని లోకేష‌న్స్ చూసాక క‌జ‌క్ స్ధాన్ లో అద్భుత‌మైన లోకేష‌న్స్ లో ఉన్నాయ‌ని తెలుసుకున్నాం. ఇంత వ‌ర‌కు ఎవ‌రూ అక్క‌డ షూటింగ్ చెయ్య‌లేద‌ని తెలుసుకుని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి 15 రోజుల పాటు క‌జ‌క్ స్ధాన్ లో మూడు పాట‌ల్నిఅద్భుతంగా చిత్రీక‌రించాం. ఈ పాట‌ల‌కు వి.జె.శేఖ‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌పీ వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు ఎక్స్ ట్రార్డిన‌రీగా ఈ పాట‌ల‌ను తెర‌కెక్కించారు.క‌జ‌క్ స్ధాన్ షెడ్యూల్ తో 60 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. జూన్, జులై, ఆగ‌ష్టు ల‌లో జ‌రిగే షెడ్యూల్స్ తో చిత్రం పూర్త‌వుతుంది. వైశాఖం 2016లో నిర్మాత‌గా నాకు, ద‌ర్శ‌కురాలిగా జ‌య‌కు ఈ చిత్రం గొప్ప ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు.
త్వరలో ఈ సినిమా పాటలు, ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి సంగీతం : డి.జె.వసంత్, కెమెరా: సుబ్బరావు, డాన్స్ : శేఖర్ మాస్టర్.IMG-20160530-WA0002

 ‘కొత్త కొత్తగా వున్నది’ సెన్సార్ పూర్తి

సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సతీష్ గుండేటి దర్శకత్వంలో పెర్లా ప్రభాకర్, తోట గోపాల్ రూపొందించిన చిత్రం ‘కొత్త కొత్తగా వున్నది’.
పెళ్లికి ముందు ప్రేమికులకు సంబంధించిన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి
ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.IMG-20160529-WA0000

రివ్యూ : ఒక్క క్షణం (మంచికైనా – చెడుకైనా)

తారాగణం : శ్రీధర్ యాదవ్, సంతోష్ కుమార్, స్వప్న, శ్రీనివాస్ కొలాల, జాన్సన్ ఇతర నటి నటులు.
కెమరా : డి. యాదగిరి, ఎడిటింగ్ : టి.రామం, సంగీతం : ప్రవీన్ కుమార్, నిర్మాత : శ్రీధర్ యాదవ్ స్టోరి: రామోజు కృష్ణ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వాలీ
కథ లోకి వెళితే : ఊర్లో పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసుకునే శ్రీధర్ యాదవ్ అనే ఒక రౌడీ సిటీ లో చదువుకుంటున్న తన చెల్లి మేధని చూడటానికి హాస్టల్ కి బయల్దేరుతాడు… అక్కడికి వెళ్ళెసరికి మేధ గుడికి వెళ్ళిందని తెలిసి అక్కడికి బయల్దేరుతాడు… దారిలో ఎదురైన తన చెల్లితనని వెంబడిస్తూ వస్తున్న అంజి గురించి ఏడ్చుకుంటూ చెప్పగానే కోపంతో ఊగిపోయిన శ్రీధర్ అతన్ని ఏం చేశాడు… అసలు అంజి మేధని ఎందుకు వెంబడించాడు, ఆ తర్వాతేం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి.

విశ్లేషణ:
ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది.6-Sheet-001
భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ ఎలివేట్ చేయడం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. ఈ సినిమాకు అన్నింటికంటే ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే విలన్ క్యారెక్టరైజేషన్ అనే చెప్పుకోవాలి. విలన్ పాత్రను రూపొందించిన విధానం వల్ల సినిమాకు కాస్త కొత్తదనం వచ్చింది. ఇక ఆ పాత్రలో నటించిన శ్రీధర్
కూడా సినిమాకు ఓ హైలైట్‌గా నిలిచారు. స్టైలిష్‌గా కనిపిస్తూ, వయలంట్‌గా ప్రవర్తిస్తూ ఆ పాత్రను బాగా చేశాడు.
దర్శకుడు సాంకేతికంగా కానీ, నటీనటుల నుంచీ కానీ మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు.నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. సంతోష్ కుమార్, స్వప్న, శ్రీనివాస్ కొలాల, జాన్సన్
తదితర నటీనటులంతా తమ పరిధిమేర బాగా నటించారు.

4-Sheet

 

హైదరాబాద్ లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 

శాతవాహన రాజైన గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
తన వందో చిత్రంగా చేయనున్న విషయం తెలిసిందే.శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే అద్భుతమైన లోకేషన్స్ మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో మొరాకోలో సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది.

మే 30 నుండి హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ దేవాలయం సమీపంలో రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకోనుంది. ఇప్పటి వరకు ఎవరు వేయనంత పెద్ద యుద్ధనౌక సెట్ ను వేసి ఆ సెట్ లో షూటింగ్ చేయనున్నారు.

IMG-20160528-WA0007

కొత్త ట్రెండ్ కి శ్రీ శ్రీ శ్రీకారం

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ శ్రీ’.

50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన కథానాయకుడిగా నటించిన శ్రీ శ్రీ్ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది.సూపర్ స్టార్ కృష్ణ తో పాటు విజయ నిర్మల , మరియు సీనియర్ కామెడీ హీరో నరేష్ , సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు.

అదే రోజున శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో

సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ…తెలుగు వారంద‌రికీ వినోద సాధ‌నం సినిమా. 50 ఏళ్ల క్రితం తేనె మ‌న‌సులు అనే ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్ చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌యం అయ్యాను. గూడ‌చారి 117, అల్లూరి సీతారామ‌రాజు, సింహాస‌నం…ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించాను. శ్రీ శ్రీ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేస్తున్నాం. అదే రోజున విదేశాల్లో శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నాం అన్నారు.

విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ…ముప్ప‌ల‌నేని శివ క‌థ చెప్పిన వెంట‌నే నాకు బాగా న‌చ్చింది. సెంటిమెంట్ డ్రామాతో ఉన్న ఈ క‌థ అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది.

డైరెక్ట‌ర్ ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ…పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యాను. ఎన్నోవిజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

IMG_20160528_161719_881

Karthikeya Cameo Role with Kajal in Bollywood Movie

. Karthikeya goud is young enterpenuear and introduced to tollywood in Posani Krishna Murali’s  ” Sravana Masam ” Movie and ” Ullasanga Utshanaga ” movie  in nice characters.
Now the karthikeya coming with nice cameo role in hindhi movie named ” DO LAFZO KI KAHANI ” .
IMG_5623 (1)-3
IMG_5622 (1)-14L0T46324L0T4631-1

తెలుగు మొదటి జాంబీ వస్తుంది

ఎటు చూసిన స్మశానమే అంత నిశబ్దం… చుట్టు ఎవరు ఉండరు భయం కరంగా గాలి వీస్తుంది అంతే ఒక్కసారిగా దైయ్యం లాంటి మనిషి నడవలేక నడుస్తూ వింత ఆకరంతో మనవైపు వస్తుంటాడు అంతే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఆ నడిచి వచ్చే ఆకారన్ని జాంబీ అంటారు.జాంబి అంటే బ్రతికున్న శవం. జాంబి అనే పదం వరల్డ్ సినిమా ప్రేమికులకు సుపరిచితమే… మనకు సినిమాలా పరంగా యాక్షన్, హారర్, థ్రిల్లర్, ఎమోష్‌నల్, కామెడిలాంతి సినిమాలు తెలుసు కాని ఇది ప్రత్యేకమైన జానర్. కానీ ఈ జానర్లో ఎలాంటి కథావస్తువుతొనైనా అంటే పైన చెప్పబడిన అన్ని జానర్స్లలో సులబంగా ఇమిడిపొయే సినిమా జానర్ “జాంబి జానర్”. హాలివుడ్‌లో నేను పైన చెప్పిన అన్ని కథవస్తువులతో ప్రయోగాలను చెయడం జరిగింది.
మొదటగా 1940 “వైట్ జాంబి” సినిమాతో ఎంటర్ అయినటువంటి జాంబీలు.. 84 సం”లుగా రకరకాల ప్రయోగాలు మార్పులు జరుగుతూ విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు.
ప్రపంచ సినిమా రంగంలో హారర్ సినిమాలతో సమానంగా జాంబీ సినిమాలకు క్రేజ్ ఉంది. ప్రతి సంవత్సరం కనీసం రెండు జాంబి సినిమాలైనా హలివుడ్‌లో విడుదల అవుతుంటాయి. అంతటి ప్రత్యెకత కలిగిన ఈ జనర్ సినిమాల నిర్మాణం ఇండియాలొ అంతగా జరగలేదు.. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క సినిమా సినిమా నిర్మించారు. అది హిందిలో “గొ గొవా గాన్” -2013లో విదుదలై మంచి విజయాన్ని సాదించింది.
జాంబి సినిమా నిర్మాణం జరగక పోవడానికి ముఖ్యకారణం జాంబిల మేకప్ మరియు తగిన లొకెషన్ సెట్టింగ్స్. వందల మంది ఆర్టిస్టులను జాంబిలుగా తయారుచేయడం & గ్రమలను పుర్తిగా నాశనం అయినట్లుగా చూపించడం శ్రమ, ఖర్చుతో కూడుకున్నది.. మాములుగా హారర్ సినిమాలు నిర్మించేది. కొత్త నిర్మాతలే కాబట్టి వారు ఇంత రిస్క్ చేయలేక పొయారు.

 

కాని మారుతున్న మేకింగ్ విధానాలు, టెక్నాలజీ, యువ దర్శకుల ఆలోచనవిధానం ఈ జానర్‌లో సినిమాల వైపు అడుగులు వేస్తున్నయి. ముఖ్యంగా 2016లో తమిళంలో “మిరుతన్”, తెలుగులో “విషపురం” సినిమాలతో సౌత్ఇండియాలో జాంబి వేట మొదలవుతుంది. మిరుతన్ సినిమా తమిళ స్టార్ జయంరవి హీరొగా భారి బడ్జెట్‌తో గ్లోబల్ ఇంఫొమెంట్ వారు నిర్మించడం జరుగుతుంది. మిరుథన్ సినిమా త్రైలెర్స్, పబ్లిసిటీ తో జనాలను అకట్టున్నరు. ఇక తెలుగులో “విషపురం” సినిమా కొత్త నటినటులతో, టెక్నిషియన్స్‌తో లింకన్ మెథడ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఫెస్‌బుక్‌వంటి ఆన్‌లైన్ మిడియాలో ఇప్పటికే జాంబి పొస్టర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాల విజయంతో నైనా 84సం”లుగా హాలివుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న జాంబి సినిమాలు తెలుగులో రెగ్యులర్‌గా రావాలని కొరుకుంటున్నాను.

ఎటు చూసిన స్మశానమే అంత నిశబ్దం… చుట్టు ఎవరు ఉండరు భయం కరంగా గాలి వీస్తుంది అంతే ఒక్కసారిగా దైయ్యం లాంటి మనిషి నడవలేక నడుస్తూ వింత ఆకరంతో మనవైపు వస్తుంటాడు అంతే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఆ నడిచి వచ్చే ఆకారన్ని జాంబీ అంటారు.జాంబి అంటే బ్రతికున్న శవం. జాంబి అనే పదం వరల్డ్ సినిమా ప్రేమికులకు సుపరిచితమే… మనకు సినిమాలా పరంగా యాక్షన్, హారర్, థ్రిల్లర్, ఎమోష్‌నల్, కామెడిలాంతి సినిమాలు తెలుసు కాని ఇది ప్రత్యేకమైన జానర్. కానీ ఈ జానర్లో ఎలాంటి కథావస్తువుతొనైనా అంటే పైన చెప్పబడిన అన్ని జానర్స్లలో సులబంగా ఇమిడిపొయే సినిమా జానర్ “జాంబి జానర్”. హాలివుడ్‌లో నేను పైన చెప్పిన అన్ని కథవస్తువులతో ప్రయోగాలను చెయడం జరిగింది.
మొదటగా 1940 “వైట్ జాంబి” సినిమాతో ఎంటర్ అయినటువంటి జాంబీలు.. 84 సం”లుగా రకరకాల ప్రయోగాలు మార్పులు జరుగుతూ విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు.
ప్రపంచ సినిమా రంగంలో హారర్ సినిమాలతో సమానంగా జాంబీ సినిమాలకు క్రేజ్ ఉంది. ప్రతి సంవత్సరం కనీసం రెండు జాంబి సినిమాలైనా హలివుడ్‌లో విడుదల అవుతుంటాయి. అంతటి ప్రత్యెకత కలిగిన ఈ జనర్ సినిమాల నిర్మాణం ఇండియాలొ అంతగా జరగలేదు.. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క సినిమా సినిమా నిర్మించారు. అది హిందిలో “గొ గొవా గాన్” -2013లో విదుదలై మంచి విజయాన్ని సాదించింది.
జాంబి సినిమా నిర్మాణం జరగక పోవడానికి ముఖ్యకారణం జాంబిల మేకప్ మరియు తగిన లొకెషన్ సెట్టింగ్స్. వందల మంది ఆర్టిస్టులను జాంబిలుగా తయారుచేయడం & గ్రమలను పుర్తిగా నాశనం అయినట్లుగా చూపించడం శ్రమ, ఖర్చుతో కూడుకున్నది.. మాములుగా హారర్ సినిమాలు నిర్మించేది. కొత్త నిర్మాతలే కాబట్టి వారు ఇంత రిస్క్ చేయలేక పొయారు.

కాని మారుతున్న మేకింగ్ విధానాలు, టెక్నాలజీ, యువ దర్శకుల ఆలోచనవిధానం ఈ జానర్‌లో సినిమాల వైపు అడుగులు వేస్తున్నయి. ముఖ్యంగా 2016లో తమిళంలో “మిరుతన్”, తెలుగులో “విషపురం” సినిమాలతో సౌత్ఇండియాలో జాంబి వేట మొదలవుతుంది. మిరుతన్ సినిమా తమిళ స్టార్ జయంరవి హీరొగా భారి బడ్జెట్‌తో గ్లోబల్ ఇంఫొమెంట్ వారు నిర్మించడం జరుగుతుంది. మిరుథన్ సినిమా త్రైలెర్స్, పబ్లిసిటీ తో జనాలను అకట్టున్నరు. ఇక తెలుగులో “విషపురం” సినిమా కొత్త నటినటులతో, టెక్నిషియన్స్‌తో లింకన్ మెథడ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఫెస్‌బుక్‌వంటి ఆన్‌లైన్ మిడియాలో ఇప్పటికే జాంబి పొస్టర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాల విజయంతో నైనా 84సం”లుగా హాలివుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న జాంబి సినిమాలు తెలుగులో రెగ్యులర్‌గా రావాలని కొరుకుంటున్నాను.

Vishapuram Movie

Director : Vishvam Sandiri
Producers : B. Venkatesham, Sridhar Sandiri ,
Pathuri MadhavReddy, pathuri Buchi Reddy, Bandi Ramesh
Music: Sri Venkat
Cinematographer : Kishan Thipparaveni
Editing : Ramu Mogiloji
Dialogue Writer : Mahesh Suryavamshi Lingakar
Lyrics: suhasini, ramaswami, udhay

Cast :Devaa Malishetty, Haritha, Vj Ram, Kishan Nunugonda, Saleem, Prasad, Yadav Reddy, Mallesham, warangal shasthri, radhandi sadaiah, veerabadram, raju mundrai.

Screen Shot 2016-05-24 at 7.42.47 pmScreen Shot 2016-05-24 at 7.30.00 pmScreen Shot 2016-05-24 at 7.41.04 pm

|| ప్రేమ బాగోతం ||

 


కాకరపర్తి పద్మజా

చూపుల పరపరాగ సంపర్కం..
మనసు మొక్కకు ప్రేమ మొగ్గై తొడగటం..
ఊహల నీరెంత పోసినా..
ఊసుల చిగురు వేయనంటుంటే..
వలపుల ఎరువు ఎంత వేసినా…
అలకల కలుపు మొక్కలకే..
బలమవుతున్నాయి…
ఏమిటో ఈ బంధాల మాయలేమిటో. ..

ప్రేమే కదా అని కాస్త చోటిస్తే..
తనువంతా అల్లుకుంటుంది…
వెన్నెల మమతలను కురిపిస్తూ..
విషాద విరహామవాస్యలనే..
పంచుతానంటుంది..
తేనెల మకరందాలనే..
అందిస్తానంటూ…
తేనెటీగై కాటేస్తుంది..

వికసించిన సుమంలా..
పరిమళాల తలపులతో..
మది పొరల్లో నిక్ష్పిత్తమై..
దారి తెలియని…
పద్మవ్యూహంలో నున్న..
అభిమన్యుడినే అంటుంది..
కులమత భేధం లేదు..
ఎవరినైనా ఎదిరిస్తానంటూ..
ఓప్పుకోక పోతే ..
యాసిడ్ తో…
ప్రాణాలు మరిగిస్తానంటూ బెదిరిస్తూ…
ప్రేమ పాశాలనే..
ఉరితాళ్ళను చేస్తుంది..

అన్ని బంధాలలో..
నేనున్నానంటూ..
కొందరికి అందుతూ..
అందని జాబిలా..
వెనువెంటే నీడలా తిరుగుతూ. .
ఉరకలు వేయించి. .
ఊపిరి తీసే..
మహమ్మారే ప్రేమ…

రెండక్షరాల పదాన్నే నేనంటూ..
క్షణమైనా గడవనీక..
తన లక్షణాలన్నింటిని..
మనకే వీలునామా రాస్తూ..
కాలపు బంధీఖానాలో..
జీవిత ఖైదు చేస్తుంది..

ప్రేమ ను ప్రేమ గా..
ప్రేమించండి..
ప్రేమకే దాసోహం అవద్దూ..
పసిపిల్లలను ఆదరించండి..
ప్రేమ గా..
ఆడపిల్లల్ని గౌరవించండి..
ప్రేమ గా..
అక్క చెల్లెలను,అన్నదమ్ములను..
ప్రేమించు..ప్రేమ గా..
వృద్ధాప్యాన తల్లితండ్రులను..
స్వాంతన పర్చు…ప్రేమ గా..
నీకై నూరేళ్లు తోడుండే..
భార్య కూ ప్రేమను..
పంచు.. ప్రేమ గా..
ప్రేమ నే నీ బానిసగా..
చేసుకో..
ప్రేమ కు నువ్వే వశమవ్వకూ..
చిరునామాలేని..
జీవితమే నీదవుతుందీ..