Daily Archives: April 19, 2016

ఏడి నా మూలవాసి(రైతు)..!

*** రాజు పెండ్యాల ***

ఏడి నా మూలవాసి(రైతు)..!FB_IMG_1459303349000

పొద్దు పొద్దున
నాగలి భుజాన చేతుల పగ్గం
పట్టుకుని బాయి కాడికి పోయిన రైతు ఏడి..?
పల్లెల్లో ఎటుచూసిన
కానరాక కనుమరుగవుతున్న
నా అన్నదాత ఏడి..?

భూమాత ఒడిని చీల్చి
పచ్చని పంట పెంచు
నా దేశ మూలవాసి
వెన్నుపూస విరిగి మూలపడ్డాడా..?

కమ్మరి కొలువుల
మంటల కొలిమిలో
కర్రు మొన పెట్టించిన వడ్లోల్ల ఇంటి కాడ
గొర్రుకి పండ్లు పెట్టించిన
ఆ వారి కోసి మెదలు తీసిన పైర ఏరనిచ్చినా ఆ ప్రాణదాత ఏడి..?

భాయి దగ్గర మైసమ్మ
నీ అప్పుల మాటలు విని మాయమయిందా…
నాట్లేసే దగ్గర బోనం పెట్టిన ఉప్పలమ్మకి నీ ఉసురు తాకాలేదా..
నీ ఒడుపాటిదా పాటి ఎడ్లకికాలుగర్ర పడితే కరుణించిన
ఆ కాట మయ్య ఏడి..!

నీవు పండించిన వడ్ల కుప్ప కాడికి వచ్చినోడికి
బుడ్డితో కొలిసిపోసిన భూస్వామి ఏడి..
వాన దేవుడు కారుణించలేదని
కప్ప తల్లి ఆడించిన కరుణమూర్తి ఏడా..

అయ్యో నా దేశం వెన్నెముక నీ వెన్నుపూస విరిగిందని ఉరి పెట్టుకొనికి వరి గడ్డి లేదని పురుగుల మందే నీ ప్రాణం తీసిందా..

నిన్ను కట్టుకున్న దాని కన్నీటికి కోట్లు విడుదల చేసి గట్లుగా డ్యాం లు కడుతున్నవాడి జేబులు నిండినయి

పనికి రాని ప్రభుత్వాన్ని ప్రశ్నించక కాటికి పయనమయిపోయావు
ఇక కానరాడు రైతనే వాడు
మ్యూజియంలో బొమ్మలాగా

భూతల్లి ఒడిని ప్రేమతో చీల్చిన రైతు భూమిపై భారమై
తన ఒడిలో కలిసిపోయాడు