బొప్పాయి పండు

 

జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చేస్తుంది. ఓ పండుగా తినటం కోసమే కాకుండా బొప్పాయి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది.

మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్images ఆసిడ్ (విటమిన్‌ సి) ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజూ ఓ బొప్పాయి పండు తీంటే స్థూలకాయంమామూలుగా బొప్పాయికాయతో పప్పు, పులుసు, కూర, పచ్చడి, హల్వా చేసుకోవచ్చు.
పోషక విలువలుపోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 40 kcal 160 kJపిండిపదార్థాలు 9.81 g- చక్కెరలు 5.90 g- పీచుపదార్థాలు 1.8 gకొవ్వు పదార్థాలు 0.14 gమాంసకృత్తులు 0.61 gవిటమిన్ A 55 μg 6%థయామిన్ (విట. బి1) 0.04 mg 3%రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.05 mg 3%నియాసిన్ (విట. బి3) 0.338 mg 2%విటమిన్ బి6 0.1 mg 8%విటమిన్ సి 61.8 mg 103%కాల్షియమ్ 24 mg 2%ఇనుము 0.10 mg 1%మెగ్నీషియమ్ 10 mg 3%భాస్వరం 5 mg 1%పొటాషియం 257 mg 5%సోడియం 3 mg 0% శాతములు,* కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. * మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. * కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది. * బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. * విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. * బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది. * బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. * కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు
ఇతర ఉపయోగాలుబొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. * బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ తగ్గుతాయి. * బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు. * బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్‌ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది. * ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది. * మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. * ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. * బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు. * బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివీ తగ్గుతాయి. * బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. * పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది. * శృంగారప్రేరితంగానూ పనిచేస్తుంది. * గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్‌ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు. * కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు. * డయాబెటిస్‌ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది. * బొప్పాయిలోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.