Monthly Archives: April 2016

°° గది గూడు °°

విజయ్ కుమార్ ఎస్వీకే

FB_IMG_1458985753159

ఒకింత ప్రాణం వొలికిపోతుంది

దూరాన పిట్టలు
గడియారంలో
సమయాలవుతాయి

తపనలా
ప్రాణం వొలికిపోతుంది

ఒక ఘటన
ఒక గురుతూ
పక్షులు

కన్నురెప్పలు
వాటితో పాటూ
రెక్కలు కట్టుకుంటాయి

కిటికీదేహంలో
యేడుపులా
చుట్టుకుపోతా

శూన్యం
వొలికిపోతున్న
సాయంత్రం

ఉదయాలూ
చీకటిపడే వేళల్లో
నేను
నా గదిగూడులో
రెక్కలు లేని పక్షిపిండాన్ని

‘సుప్రీమ్’ సెన్సార్ పూర్తి

సాయి ధరమ్ తేజ్ నటి౦చిన ‘సుప్రీమ్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.సుప్రీమ్ మే 5 న  విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గాFB_IMG_1461941483557 రూపొందించబడింది.ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.శిరీష్ , దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఎస్ విసీ బ్యానర్ పై నిర్మించబడుతుంది.ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.అంతేకాకుండా , హీరోయిన్ రాశి ఖన్నా పోలిస్ పాత్రలో కనిపించబోతుంది.

‘కబాలి’ టీజర్ విడుదల తేదీ ఖరారు

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, రియలిస్టిక్ సినిమాలతో తమిళనాట సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘కబాలి’. ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. ఓ వయసైన గ్యాంగ్‍స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ‘కబాలి’ సినిమా
ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో అంతటా విపరీతమైన అంచనాలు రేకెత్తించిన కబాలి సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీజర్ ఇప్పుడు రిలీజ్, అప్పుడు రిలీజ్ అంటూ చాలా ప్రచారాలే బయలుదేరాయి.
మే 1వ తేదీన కబాలి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్
అధికారికంగా ప్రకటించేసింది. images

పడతీ……….ఎక్కడున్నావ్!!!

received_10154152589319207

ఒక దేవదేవుని సతివై సగమైనావు
కష్టాలకానల్లో వెన్నంటి బలియైనావు
అనుమానపు ఉలితాకి అగ్నిపునీతవైనావు
కానల్లో ఒంటరివై కనుమరుగైనావు
ఓ సీతా భూజాతా…ఎక్కడ తల్లీ నీ జాడ

ఒక తల్లిమాటకైదుగురికాలియై
ఒక భర్త జూదానికి బలియై
నలుగురిలో వస్త్రాపహరిణివై
నవ్వుల పాలైన పాంచాలీ
ఎద పగిలిన ధీశాలీ! నీకు మా జోతలివే…

నేటికీ హరిశ్చంద్రుల(నుకునేవారి) సతివై
అంగడిలో సరుకై…అమ్మకమై
అణువణువూ తాకట్టౌతున్నావ్
పతి సుఖమే పరమావదియనుకున్న
ఓ ఇంతీ నీ సహనానికి మా కన్నీటిచేమంతులివే…

అమ్మతనంలో ఆడతనాన్ని చూస్తున్నారు
అమ్మాయిలను ఆటవిడుపు చేస్తున్నారు
నడిరోడ్డైనా నాలుగ్గోడల్లో అయినా
చెలీ! నీకు లేదుగా ఏ భద్రతామరుగు…ఇట చెల్లీ
నువ్ పుట్టగానే నీపై మృగాడికి పుట్టేది వాంఛేనే తల్లీ..

ఇంకా ఉన్నా వ్రాయలేను…
ఎన్ని వ్రాసినా ఇంతి చరితింతేను…
అందుకే స్వస్తిస్తున్నా….ఇక్కడే
శ్వాస సగమై…ఎడద భారమై…

||పద్మా శ్రీరామ్||

చిరంజీవి రీఎంట్రీకి ముహుర్తం ఖరారయ్యిందా..?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీకి ముహుర్తం ఖరారయ్యిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్‌తో చిరు రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినవస్తొన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు వినాయక్ కథని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేసే పనిలో ఉన్నారట.ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్.ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.ఈ సినిమా ఈ నెల 29 పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానట్టు తాజా సమాచారం.images

జగపతిబాబు ”క్లిక్ సినీ కార్ట్“ను ప్రారంభం 

సినీ రంగంలోని 24 విభాగాల్లో ప్రవేశించాలనుకునే వారికి హీరో జగపతి బాబు సదవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనిలో భాగంగానే క్లిక్ సినీ కార్ట్ అనే సినిమా పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ లోని హోటల్ పార్క్ హయత్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఈ పోర్టల్ ఒక చక్కని అవకాశమని వారు అన్నారు. క్లిక్ సినీ కార్ట్ లాంఛ్ అవడం సినీ ఇండస్ట్రీకి శుభ పరిణామమని కొ
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, టీడీపీ నేత, సినీ నటుడు మురళీమోహన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ, జగపతిబాబు ఈ పోర్టల్ ను ప్రారంభించడం ఎంతో సంతోషమంటూ ఆయనను అభినందించారు. చిత్ర రంగంలో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు, పరిశ్రమకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ, ఈ పోర్టల్ ద్వారా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించే అవకాశం నిర్మాతలకు కలుగుతుందని అన్నారు.
జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ”సినిమాలు చేయడానికి ఈ వెబ్ సైట్ నౌకరి.కామ్ లాంటిది. ఇలాంటి కొత్త ఐడియాలు, ఇన్నోవేషన్స్ మరిన్ని రావాలి. ఇండస్ట్రీలో ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.

హెచ్.టి.కుమారస్వామి మాట్లాడుతూ.. ”కొత్తవాళ్ళను ప్రోత్సహించాలని జగపతిబాబు తీసుకున్న నిర్ణయం అభినందదాయకం. ఆయన వెనుక ఉండి సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నాను” అని చెప్పారు.25-1461578702-click01

 

యద్దనపూడి సులోచనా రాణి…తెలుగు సాహిత్యాన్ని మూడు దశాబ్దాలపాటు శాసించిన నవలా రాణి. మధ్యతరగతి మగువల మధురోహలను పెట్టుబడిగా పెట్టి అక్షర తీయందనంతో వారి మందహాసాలను దోచుకున్న ఆశలవేణి. ఆమె కలం నుంచి జాలువారిన “సెక్రటరీ” నవలను కె.ఎస్.ప్రకాశరావు (కె.రాఘవేంద్రరావు జీ తండ్రి) దర్శకత్వంలో డా.డి.రామానాయుడు అత్యంత అందంగా తెరకెక్కించారు.

సాధారణంగా సులోచనా రాణి రచనల్లో హీరోయిన్ పొగరు ,పౌరుషం, ఆత్మాభిమానం, ఆభిజాత్యం పుష్కలంగా ఉన్న పాత్రల్లో మధ్యతరగతి అమ్మాయిగా అత్యంత సొగసుగా ఒదిగిపోతుంటుంది. అలాంటి మధ్యతరగతి అమ్మాయే జయంతి. శీలానికి రక్షణ లేని కంపెనీ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఏమి చేయాలా అని ఆలోచనలో ఉన్న జయంతికి తన సెక్రటరీ లీవ్ లో వెళ్ళడంతో ఖాళీ అయిన ఉద్యోగాన్ని ఆఫర్ చేసి క్యాంప్ కెళ్ళి వస్తూ ఒక చీర కొని ప్రెజెంట్ చేస్తాడు హీరో రాజశేఖర్.

చీర చూడగానే మనసు దోచుకున్నా..స్త్రీ సహజమైన బిడియం, తనకలవాటైన ఆభిజాత్యంతో కట్టుకోకూడదు అని నిర్ణయించుకున్న జయంతి , రాజశేఖర్ మరల టూర్ కి వెళ్ళడంతో మనసు పదే పదే ఆ చీర కట్టుకోమని పోరు పెడుతుండడంతో ఆ చీర కట్టుకుని సినిమాకి వెడుతుంది. అదే సమయంలో టూర్ కి వెళ్ళిన పని త్వరగా ముగియడంతో తిరిగి వచ్చిన రాజశేఖర్ అదే సినిమాకి రావడం తటస్థిస్తుంది. అనుకోకుండా సీట్స్ పక్క పక్క నే రావడంతో ఒకరినొకరు పలకరించుకుంటారు. తను కొన్న చీరకు జయంతి కట్టుబడితో కొత్తందం వచ్చిందని రాజశేఖర్ ఆనందిస్తాడు. వద్దనుకుంటూ కట్ట్టుకున్న చీరతో అతని కంట పడ్డం కాస్త బిడియంగా అనిపించినా ఏదో తెలియని కొత్త అనుభూతికి లోనౌతుంది జయంతి. వారిద్దరి భావాలకు తగ్గట్టు సినిమాలో పాట వారిద్దని అంతరాలను స్పృశిస్తూ సాగుతుంది..

అలతి పదాలే అయినా అందంగా మన మదిని తాకుతుండె సాహిత్యాన్ని చూడండి ఒకసారి…

“తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా”

అంటూ కవ్వించిన మొగుడికి

“నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ”

అంటూ బాధ్యతంతా అతని వలపుదే అంటూ ఇల్లాలు దీటుగా చెప్తుంది సమాధానం. అతనిపై తనకున్న అనురాగాన్ని అతని కల్ళల్లో చూసుకుంటానంటూ…. మహిళకు అత్యంత ప్రీతిపాత్రమైన అద్దంతో ఆతని కన్నులను పోలుస్తూ తన సొగసును అక్కడ భద్రంగా దాచుకోమని అన్యాపదేశంగా చెప్తుంది…

“నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకుంటానందాలూ”

ఆమెకు ఏ మాత్రం తీసిపోకుండా….ఆమె కనుబొమల సోయగం విసిరే బాణాలకే ఆమె అందాలు దాచుకున్న తన కనుపాపలు పగిలిపోతాయంటూ చెణుకు విసురుతాడు

“విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు
విరిగిపోవునేమొ ఈ అద్దాలు”

నాకు ఈ చమత్కారాలు చాలా బాగా నచ్చాయి…మీరూ ఆస్వాదిస్తారని ఆశిస్తూ….మీ కోసం….

చిత్రం: సెక్రటరి .
సంగీతం : కె వి మహదేవన్ గారు
రచన : ఆచార్య ఆత్రేయ గారు
గానం: రామకృష్ణ . సుశీల గార్లు

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా
నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ
దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా

 

షూటింగ్ పూర్తిచేసుకున్న అ..ఆ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా తెరకేక్కిస్తున్న చిత్రం ‘అ…ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి).ఈ సినిమా లో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందించారు. హారిక మరియు హసిన్ క్రియేషన్స్ బ్యానర్ ఫై చిన్న బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
హైద్రాబాద్‌లో జరుగుతోన్న చివరి షెడ్యూల్‍ను నిన్న పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది.  ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నితిన్ చెప్పాడు. అంతేకాదు మూవీ యూనిట్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. FB_IMG_1461503991671

చెన్నై షెడ్యూల్ లోకి రోబో టీం.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రోబో సినిమాకు సీక్వెల్ గా వస్తున్నది ‘రోబో 2.0’ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్నందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ లో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలకపాత్రలో కనిపిస్తాడు. సన్నివేశాలన్నింటిలోనూ భారీ గ్రాఫిక్స్ వాడనున్నారట. తాజాగా ఢిల్లీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని చెన్నై షెడ్యూల్ లోకి అడుగు పెట్టబోతోంది రోబో టీం. ప్రస్తుతానికి మొత్తం యూనిట్ కు సమ్మర్ బ్రేక్ ఇచ్చాడు శంకర్. తిరిగి 27 నుంచి చెన్నై శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ భారీ ఖర్చుతో ఈ సెట్ వేశారని సమాచారం. సినిమాలో కీలక సన్నివేశాలన్నీ ఈ సెట్లోనే చోటు చేసుకుంటాయట.images

29న వస్తున్న ‘రాజా చెయ్యి వేస్తే ‘

నారా రోహిత్ ఇషా జంట గా  ప్రదీప్  దర్శకత్వంలో తేరక్కిస్తున్న చిత్రం రాజా చెయ్యి వేస్తే.సాయి కోర్రపాటి  నిర్మించారు.ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇలా నారా, నందమూరి హీరోలు కథా నాయకుడు, ప్రతి నాయకుడు పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా ఆసక్తిని రేకెత్తించింది.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజా చెయ్యి వేస్తే ట్రైలర్, బ్యాగ్రౌండ్ మ్యూజక్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. తారకరత్న పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.FB_IMG_1461396595610ఈ చిత్రం ఆడియో ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.పాటలకు ఆడియెన్స్ నుండి మంచి  స్పందనను రాబట్టుకుంది.
సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు  U/A సర్టిఫికెట్ ఇచ్చిన  విషయం తెలిసిందే.  ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది.