Monthly Archives: March 2016

త్రిష ‘నాయకి’ మొదటి పాట రేపు విడుదల

త్రిష కథానాయికగా హారర్ ఎంటర్ టైనర్ గా
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నన్నారు .ఈ చిత్ర ఆడియో రఘు కుంచె మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందించబడింది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర మొదటి వీడియో సాంగ్ ని రేపు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు
ఈ చిత్ర నిర్మాత
దర్శకులు ,చిత్ర యూనిట్.FB_IMG_1459438217673

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెన్సార్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి సినిమాను ఏప్రిల్ 8న విడుదల కానుంది . నేటితో సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. సెన్సార్ బృందం సర్దార్ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక దీంతో సినిమా విడుదలకు అన్ని పనులూ పూర్తయిపోవడంతో, టీమ్ రేపట్నుంచి భారీగా ప్రమోషన్స్ నిర్వహించనుంది.కమర్షియల్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.images

బాలయ్య వందో సినిమాలో నయనతార

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించబోయే వందో సినిమాపై నెలకొన్న కన్ ఫ్యూజన్ అంతా తోలిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే క్రిష్ దర్శకత్వంలోనే సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్దం అయినట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే ప్రాజెక్టును ఏప్రిల్ 8న ఉగాది కానుకగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు.తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా నయనతారను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8వ తేదీనే హీరోయిన్ ఎవరన్నది కూడా ప్రకటిస్తారని సమాచారం.download

!!పల్లె గుర్తులు.. !!

FB_IMG_1459303349000

రాజు పెండ్యాల గారు రాసిన “పల్లె గుర్తులు ” చదివాక …గోరేటి వెంకన్న గారు రాసిన “పల్లె కన్నీరు పెడుతుంది ” అన్న పాట గుర్తుకు రాక మానదు (“కుబుసం ” అనే సినిమా లో కూడా వుంది )… కవిత ఎత్తుకున్న తీరు ప్రేమ తో నే మొదలు పెడతారు ..పూర్వపు రోజులో ఎవరు ఎవరికీ ఏమి కాకున్నా నాన్న, అమ్మ, చెల్లి, అక్క, బాబాయి అని ఇలా ప్రేమ కి ప్రతిరూపం గా వుండేవారు .కాని పట్టణీకరణ చెందినాక అవన్నీ ఎగిరిపోయని ..ఇదిగో మొదటి వాక్యం లా

“నా ఊరు బంధాలు,అనుబంధాల కలయిక”…/// ఇలా చెప్పడం లో గతం ఒక మధుర అనుభూతి ఇప్పుడు ఎక్కడిది అంటారు ..

సాంప్రదాయపు ఆటలను మింగేసింది ఎవరు …ఏ నయ వలసవాద పెట్టుబడి దారులు
సిర్రగోనే, కోతి కొమ్మోచ్చి,ఒంగుడుదూకుడు ఇవన్ని కాలరాసి T20 లు ఎందుకు అక్రమించున్నాయి ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలే … సాంస్కృతిక విద్వంసం వెనుక గల కారణాలు ఏమిటి తెలుసుకోవాలి మరి

భావి దగ్గర పచ్చని పంట పొలాలతో కనువిందు చేసే నా ఉరి పొలిమేరలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి ఎండిన రేగు చెట్లు (ఇప్పుడు చెట్లే లేవు …ఇంకా రేగు చెట్లు???) ….మొలిచి ఎడారి ని తలపిస్తుంది అని వాపోతారు …

//బాయికాడ ఏమొఖనా చూసినా పచ్ఛగా అగుపించే నా పల్లె ఇప్పుడు
ఇప్పుడు తొండ గుడ్లతో ఎండిన రేగిచెట్లా తో ఏడార్లా కనిపిస్తుంది…// పల్లె లో ఉన్నవాళ్ళకి బాగా పరిచియమే …ఇలాంటి స్థితులు అన్ని .

ఇప్పుడు అంటే వినోదం ఖరీదు గా మారింది కాని ఒకప్పుడు పల్లె లో వినోదం అంటే సింధు బాగోతం, యక్షగానాలు , కోలాటాలు ..రామాయణం , హరికథ వీధి నాటకం ఇలా ఉండేవి ..”ఖచ్చిర్ ” అంతా కలిసిపోయేది ..TV వచ్చినాక, భావ కాలుష్యం లో ఇవ్వన్ని కొట్టుకు పోయాయి అని, అంత గొప్ప ప్రదేశం
అంతా నిర్మానుశం గా కుక్కలు తిరిగే ప్రదేశం గా మారింది కదా నా సొంత ఉరు అని కన్నీళ్ళు పెడతాడు ..

“రాత్రి అయితే సింధు ఆటాలతో ఖచ్చిర్ అంత కలిసిపోయేది
పాడు టీవి సీరియల్లా పోకడలతో
పల్లె రాత్రి కుక్కలు తిరిగే కచ్చేరుగా మిగిలింది”

శుభానికైన, అశుభానికి అయిన పల్లెలో కల్లును తాగడం అలవాటు ///కల్లు ను నమ్ముకొని గీత కార్మికలు ఎందరో ఉన్నారు అలాంటి సాంప్రదాయ కుల వృత్తి, బ్రాందీ విస్కీ రాక తో ఊరుని ముండ మోపింది అని ఆవేదన ని , కోపాన్ని ప్రదర్శిస్తారు ..ముండ మోయడం అంటే చావడమే ..ఇక్కడ సంప్రదాయ కుల వృత్తి కి సమాధి కట్టేశారు నిజమే కదా..

“ఎండయినా వానయినా
గౌండ్లయిన దగ్గరికి పోతే కష్టాన్ని మరిచిపోయేందుకు తాగే కల్లును కాస్త
బ్రాందీ విస్కీ వచ్చి ఊరుని ముండ మోపింది”

ముగింపు ఇవ్వబోయే ముందు పంక్తులు ఎంతో అర్థవంతం గా కనపడతాయి …ఒక చేదు నిజాన్ని ఇంజెక్ట్ చేసిన తీరు బాగుంది

“నా పల్లె మనుషుల దగ్గర
మట్టివాసన కాస్త మనీ వాసనగా మారింది ” పల్లె మనుషులు అంటే నే మట్టి తో ముడిపడి ఉండేది అలాంటి పల్లె వాసులు ఇప్పుడు మట్టి నుంచి దూరం గా మని కి అంటే డబ్బు కి దగ్గర గా వచ్చేసారు ..మట్టి వాసన ఉన్నంతవరకే బంధాలు అనుబందాలు ..మనీ వాసనా ఇప్పుడు పల్లెలోకి కూడా పాకి పోయినాక ఇక బంధాలు ఎక్కడవి…?

ఇక ముగింపు వాక్యం చాల బాగా వ్యక్తం చేసారు ఒకప్పటి అందమైన నా పల్లెటూరు ను తలుచుకుంటే గుండెల్లో పల్లేరు కాయ ని గుచ్చిన నొప్పి గా వున్నది అని నాగరికత పేరు తో ..అబివృద్ధి పేరుతో ద్వసం కాబడ్డ తన పల్లె ను తలుచుకొని ఆవేదన చెందుతారు ..

“నా పల్లెను తలుచుకుంటే
పల్లేరు కాయ గుండెలో గుచ్చుకున్నట్టవుతోంది”

పల్లె వాసుల గురించి, మట్టి మనుషుల గురించి ..వారి సాంప్రదాయ వృత్తుల గురించి , నాగరికత ముసుగు లో ద్వసం కాబడ్డ పల్లె సంప్రదాయాలు …..కుల వృత్తులు అన్ని కూడా ..ఈ కవితలో చర్చించబడ్డాయి … మనం మరిచిపోతున్న పల్లె ని మరోసారి గుర్తు చేసి మరల మనల్ని పల్లె బాట కి దారి మళ్లించిన రాజు గారికి అబినందనలు ….మరిన్ని మంచి కవితలు రాసి మనల్ని అలరిస్తారని ఆశిద్దాం ..

సెలవు
-పుష్యమీ సాగర్.

గిన్నిస్‌ రికార్డులో గాయని సుశీల

ప్రముఖ గాయని, గాన కోకిల పి.సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, తులు అన్ని బాషలు కలుపుకొని దాదాపు 17,695 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సుశీల గారు స్థానం సంపాదించుకున్నారు. విజయనగరం లో పుట్టిన పి. సుశీల 1952 లో తమిళ్ సినిమా ‘పెట్ర థాయ్’ తో ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టింది.ఒక్క ఎస్పీ బాల సుబ్రమణ్యంతోనే 1,336 యుగళగీతాలను పాడారు. ఒకే జంట ఇన్ని పాటలు కలిసి పాడడంలో ఇప్పటికీ వీరిదే రికార్డు.తన కెరీర్ లో సుశీల ‘బెస్ట్ ప్లే బ్యాక్ సింగింగ్ ఫీమేల్’ గా 5 నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు.వీటితో పాటు తను ఇండియన్ గవర్నమెంట్ తరపున 2008 లో ‘పద్మభూషణ్’ అవార్డు ని సొంతం చేసుకున్నారు.unnamed

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

 

IMG-20160328-WA0024బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు . కర్మనఘాట్ ధ్యానాంజనేయస్వామి
దేవస్థానం లో హరిహర రుద్రవీణ మాస పత్రిక ఉగాది పురస్కార ల వేడుక లో మదనా నంద సరస్వతి స్వామి (తొగుట్ట ఆశ్రమం), …తత్వనంద స్వామి (అన్నోజి గూడ గాయత్రి ఆశ్రమం), పంచాంగ కర్త దైవజ్ఞ లక్కవజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాన్తి
చేతులమీదుగా పంచాంగం ఆవిష్కరణ జరిగింది .

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

IMG-20160328-WA0025IMG-20160328-WA0014

నితిన్ పుట్టిన రోజున ‘అ..ఆ’ టీజర్

IMG_20160329_111158_416మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా తెరకేక్కిస్తున్న చిత్రం ‘అ…ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి).ఈ సినిమా లో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందిన సమాచారం మేరకు ఈ సినిమా టీజర్ ని ఈ నెల 30 న నితిన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందించాడు. హారిక మరియు హసిన్ క్రియేషన్స్ బ్యానర్ ఫై చిన్న బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా మే 6న విడుదల కానుంది.

హారర్ ఎంటర్ టైనర్ “శశికళ” ప్రచార చిత్రం !!

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘మూచ్’ . ఈ హారర్ ఎంటర్ టైనర్ ను తెలుగులో “శశికళ” పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఎమ్. ఎల్. సి. సుధాకర్ బాబు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, దర్సకనిర్మాతలు రాజ్ కందుకూరి, సాయి వెంకట్, ప్రముఖ నటులు లోహిత్, రామ్ రావిపల్లి, గీత రచయిత సిరాశ్రీలతో పాటు ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్నఅగర్వాల్-సంజీవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ వై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్. ఎల్. సి. సుధాకర్ బాబు “శశికళ” ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించి.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. సింగల్ స్క్రీన్స్ లో 5 వ ఆటకు తెలంగాణా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ విధానం అమలులోకి వచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుధాకర్ బాబు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. అందరినీ భయపెడుతూ.. వినోదాన్ని అందించే హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీరాజా సోదరుడు జయరాజ్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తొలుత ఏప్రిల్‌ 1న సినిమా రిలీజ్‌ చేయాలనుకున్నాం. కాని అదేరోజు 14 సినిమాలు రిలీజ్‌ అవుతుండడంతో రెండు వారాల గ్యాప్‌ తరువాత విడుదల చేయాలనుకుంటున్నామని.. తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా. శివ వై. ప్రసాద్-బి. సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విను భారతి!!Sashikala-5-768x439

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’

imagesదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ‘బాహుబలి -ది బిగింనింగ్’ చిత్రం ‘బెస్ట్ ఫిలిం’ నేషనల్ అవార్డు ని గెలుచుకుంది.ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా పాల్గొంది. . ఒక తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం విశేషం . గతంలో శంఖరాభరణం చిత్రం మాత్రం స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది కానీ మొదటిసారిగా జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికై సంచలనం సృష్టించింది . ఈ చిత్రం బెస్ట్ సినిమాటోగ్రఫీ , ఆర్ట్ డైరెక్షన్ & కాస్ట్యూమ్స్ , విజువల్ ఎఫెక్ట్స్ తో మంచి చిత్రం గా నిలిచింది.
’పీకు’ చిత్రం లోని మంచి పెర్ఫార్మన్స్ కి ‘బెస్ట్ యాక్టర్’ అవార్డు అమితాబచ్చన్ కి దక్కింది.’క్వీన్’ చిత్రం లో నటించిన కంగనా రనౌత్ కి ‘బెస్ట్ యాక్ట్రెస్’ అవార్డు లభించింది.’బాహుబలి’ చిత్రానికి ‘బెస్ట్ ఫిలిం ‘ అవార్డు లభించింది.

మరో కొత్త టాలెంట్ తో లారెన్స్ రెడీ

రాఘవ లారెన్స్ ఇప్పటి వరకు దర్శకుడిగా కొరియో గ్రాఫర్ గా, సంగీత దర్శకుడిగా నటుడిగా విజయాల్ని సాధిస్తున్నాడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్,raghav_305_032716124930 తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సూపర్ హిట్ సినిమా పటాస్ ని లారెన్స్ తమిళంలో ‘మొట్ట శివ కెట్ట శివ’ గా రీమేక్ చేస్తున్నాడు. అర్ బి చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సాయి రమణి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా తను నటిస్తున్న ఈ సినిమా కోసం తనలో ఉన్న మరో కొత్త టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రం కోసం సింగర్ సునీత తో కలిసి ఓ పాట పాడనున్నాడట.  లారెన్స్ సరసన ఈ చిత్రంలో నిక్కి గల్రాని హీరోయిన్ గా నటిస్తోంది.