Monthly Archives: February 2016

మహాశివరాత్రి కానుకగా ‘సతీ తిమ్మమాంబ’ విడుదల

సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర కలిగి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూపొందుతున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఎస్.ఎస్.ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది.ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకుంది. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో వెంకట్, వినోద్ కుమార్, ప్రభాకర్, రంగనాధ్, చంద్రమోహన్, రాజశ్రీ , జూనియర్ రేలంగి,
మడూరి రాకేష్ గుప్త ప్రధాన పాత్రలు పోషించారు. బండారు దానయ్యకవి సంగీతం అందించిన ఈ మూవీకి కెమెరా షాహిద్ హుస్సేన్.. దర్శకులు: బాలగొండ ఆంజనేయులు.. ఎడిటింగ్: వినయ్, దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్. రామ్కుమార్, నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.IMG-20160226-WA0011


maxresdefault

మార్చి 11 న వస్తున్నా ఓ స్త్రీ రేపు రా

రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా’. ‘కల్పితమా..కచ్చితమా’ అనేది ఉపశీర్షిక. అశోక్‌ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…

దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ”ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునేవారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా  మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ను సినిమాటిక్‌గా, డిఫరెంట్‌గా ఉండాలని కో ప్రొడ్యూసర్‌  ప్రవీణ్‌ సపోర్ట్‌తో ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రాన్ని రూపొందించాం.   ‘కల్పితమా..కచ్చితమా’ ఉపశీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా.  ఘంటశాల విశ్వనాథ్‌ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మ్యూజిక్‌తో పాటు సినిమాలో రీరికార్డింగ్‌ హైలైట్‌ కానుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను
మార్చి 11 న విడుదల చేస్తున్నాం” అన్నారు.

వైవా హర్ష, స్వప్నిక, షాన్‌, వీరబాబు, శ్యాంసుందర్‌, సోనాల్‌ ఝాన్సీ,సంతోష్ కుమార్ IMG_20160225_221103_495తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌: జి.వి, ఎడిటర్‌: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్‌, దేవర హరినాథ్‌, సాహిత్యం: సుభాష్‌ నారాయణ్‌, పవన్‌ రాచేపల్లి, స్క్రిప్ట్‌, డైలాగ్స్‌: పవన్‌ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్‌: ప్రవీణ్‌ సాగి, కథ, నిర్మాత, దర్శకత్వం: అశోక్‌ రెడ్డి.

‘ఊపిరి’ విడుదల తేది ఖరారు

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో కింగ్ నాగార్జున – కార్తి హీరోలుగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ఊపిరి ‘. తమిళంలో ‘తోజా’ పేరుతో రూపొందుతుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.మల్టీస్టారర్ గా రాబోతున్న ‘ఊపిరి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ కు గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్నది, ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 28 న విడుదల చేయనున్నారు.జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, అలీ, తనికెళ్ళ భరణితో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్‌,పాటలు:సిరివెన్నెలOopiri Movie Songs Track Listసీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కెమెరా: పి.యస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, మాటలు: అబ్బూరిరవి.మార్చి 25 న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

“సంకటహర చతుర్ధి”

బహుళ చవితి అంటే పౌర్ణమి తరువాత చవితి  ని images“సంకటహర చతుర్ధి” అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. ప్రతినెలలో వచ్చే సంకటహర చతుర్ధి కంటే మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్వేశ్వరునికి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తే పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.

సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :
సంకటాలు ఉన్నపుడు , వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తేలవరుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటె అభిషేకం చేసుకోవచు (గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం ).
గుడిలో పూజ చేసుకోవచు . లేదా ఇంట్లో నే గణపతి పటానికి గణపతి స్తోత్రాలు , గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం , వీలయితె గణపతి మంత్రాని “ఓం గం గణపతయే నమః” అనే నామని జపించుకోవాచు .
గారిక , ఎర్రని గన్నేరు పూలు , ఎర్రని మంధర పూలు , ఎర్రని గులాబీలు , ఎర్రని రక్త చందనం పెట్టి గణపతి కి పూజ చేయాలి . తెల్ల జిలెడు పూలతో పూజ చేస్తే మహా విశేషం .
మోదకం , లడ్లు నైవేద్యం చేసి చద్రుడికి కూడా నివేదన చేసి , చంద్రుడికి కూడా నమస్కారం పెట్టి , ఎవరికైనా నైవేద్యం లేదా భోజనం పెట్టి వాలు తినాలి . నిష్ఠ గ చేయాలి అనుకునే వారు ఇంకా అ రోజు కి ఉపహారం చేసి మర్నాడు దీపం పెట్టి అప్పుడు తినాలి .

“గుంటూర్ టాకీస్”కి ‘A’ సర్టిఫికేట్

unnamed

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’. సీనియర్ నరేష్, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, సిద్దు, శ్రద్ధా దాస్, లక్ష్మి మంచు, రేష్మి గౌతమ్.. తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుంటూర్ టాకీస్ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి హీట్ ని రగుల్చుతుంది. రొమాన్స్ లో రష్మి రెచ్చిపోయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. గుంటూరు టాకీస్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.బోర్డు కూడా సినిమాకు ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. సోమ‌వారం ”గుంటూర్ టాకీస్” సెన్సార్ పూర్తి చేసుకుంది. మార్చి 4 న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

అమరావతిలో ‘సర్దార్’ ఆడియో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. . ఈ చిత్రం ఆడియో వేడుకను మార్చి 12 లేదా 20న నిర్వహించాలని చూస్తున్నారు. ఆడియో పంక్షన్‌ను హైదరాబాద్ లేదా అమరావతిలో భారీగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం అమరావతిలోనే ఆడియో వేడుకను నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుక ఎక్కడ జరుగుతుందన్న విషయం ఈ వారంలో తెలిసే అవకాశముంది. పవన్‌కు జోడీగా అందాలతార కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి 25 వరకు పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే “జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది” వంటి బ్లాక్ బస్టర్స్ వీరి కాంబోలో వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు మంచి హైప్ ఉన్న సంగతి తెలిసిందే.images

సీక్రెట్ చెప్పిన మిల్క్ బ్యూటీ

తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది… అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే images‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది.

కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.

కుజ దోషం నివారణ మార్గం

images

ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం ||

కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.

కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.
ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది. ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే… స్త్రీల జాతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు కూడా ఉంటుంది. కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్యా వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.

కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని. కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు(చూపు) ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించాల్సిన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట, సంతాన హీనత , దుర్వెసనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది. వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్న భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించవచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.

కుజ గ్రహ దోషానికి కొన్ని పరిహారములు

*సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
*కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
*ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి
*పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
*షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.

 1. *సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
  *ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
  *బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
  *మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
  *స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
  *ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
  *రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
  *అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
  *కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కంది పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
  *రాగిపళ్ళెంలో కందులు,

‘ రన్ ‘ టిజర్ విడుదల

(S.s)

unnamedసందీప్ కిషన్ చూడటానికి మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు.. కానీ సినిమాలో తన పాత్రలు మాత్రం చాలా భధ్యయుతంగా ఉంటాయి.’స్నేహగీతం సినిమాలో ఒక ఫ్రేండ్ గా ‘ప్రస్థానం’ లో ఒక కృరుడుగా ‘రోటీన్‌ లవ్‌స్టోరి’ మంచి లవర్ గా గుండెల్లో గోదారి,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,రా రా…కృష్ణయ్య. మంచి తమ్ముడిగా, మంచి కొడుకు గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నడు. హీరో గా తను తాజాగా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రన్’. మిస్టర్ నూకయ్య ఫేం అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ రీమేక్ ‘నేరం’. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సరసన అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

ఈనెల 26వ తేదిన వస్తున్న “ఎలుకా మజాకా “

Elukamajaka-1

Elukaa majaakaa-100Poster-5SAI_8876 - Copy31-1
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణంగా నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “ఓ తమాషా కథ, అద్భుతమైన కథనంతో సాగే చిత్రం ‘ఎలుకా మజాకా’. సినిమాలో మాట్లాడే ఎలుక డాన్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను నవ్వి స్తుంది. ఎలుకగా బ్రహ్మానందం నటించే ప్రతి సన్నివేశం ప్రేక్ష కులను అలరిస్తుంది. సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చాయి. చిత్రాన్ని  ఈ నెల ఈనెల 26వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాటా ్లడుతూ “గ్రాఫిక్స్ వల్ల సినిమా రూపుదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఎలుక నేపథ్యంలోని సినిమా కావడంతో సినిమాకు ఎక్కువగా గ్రాఫిక్స్ చేయాల్సి వచ్చింది”అని అన్నారు. పావని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మూల కథః ఇలపావులూరి మురళీమోహన్‌, స్క్రీన్‌ప్లేః దివాకర్‌బాబు, కెమెరాః నాగేంద్రకుమార్, మాటలుః గంగోత్రి విశ్వనాథ్,సంగీతం :మోహన్.