Monthly Archives: January 2016

సంక్రాంతి శుభాకాంక్షలు

సూర్యుడు మన ప్రత్యక్ష దైవము.
అతడు అన్ని జీవరాశులకు ఆధారము, ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి.
ఖగోళ శాస్త్రం రవిని స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం.
మనకున్నవి పన్నెండు రాశులు.
సూర్యుడు నెలకొక రాశిలో కాలం గడిపి, ఆ తరుణం గడచిన పిదప ఒక రాశిని వదలి తరువాతి రాశి రాశిలో ప్రవేశిస్తుంటాడు.
సూర్యుని ప్రవేశం జరిగిన రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు. అదే సంక్రమణం.
దీనినే సంక్రాంతి అంటాము.
అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు.
అయితే ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి.
అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం.
ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం.
ఈ ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు.
ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల ప్రారంభం.
ఈ పుణ్యకాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఎక్కువగా.
ఈ పుణ్యకాలం కోసమే తండ్రి శంతనుని నుండి స్వచ్ఛంద మరణం వరంగా పొందిన కురుపితామహుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో విపరీతంగా గాయపడి ఒరిగినపుడు అర్జునుడు అమర్చిన అంపశయ్యపై ఉత్తరాయణ ఆరంభమయే వరకు నిరీక్షించాలనుకుంటాడు.

ఉత్తరాయణ శుభారంభం అయిన మకర సంక్రాంతి చాల విశిష్టమైనది.
ఉత్తరాయణంలో సూర్యునిగమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమం గా పెరుగుతూ వస్తుంది.
సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
అయితే సూర్యునికిరణాలు ఎక్కువగా సోకితే అది మనకు కూడ మంచిదికాదు.
ఎందుకంటే సూర్యరశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధమైన కాన్సర్ ను ఇతర రుగ్మతలను కలిగిస్తుంది.

మకర సంక్రాంతి మనకు శుభతరుణం.
సంక్రాంతి మనకు తెస్తుంది క్రొత్త కాంతి.
ఈ పండగ ముఖ్యంగా మూడు దినాలు. భోగి, సంక్రాంతి, కనుము.

సంక్రాంతికి ముందు రోజు భోగి. ఈ రోజు తూర్పు తెల్లారక ముందే నిద్ర లేచి భోగిమంట వేస్తారు.
పిల్లలు ఆవు పేడతో చేసిన భోగిపిడకలు దండలుగా గుచ్చి భోగి మంటలో వేస్తారు. భోగి దినం సాయంత్రం పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు.
భోగిపళ్ళులో నేరేడు పళ్ళు, కొత్త పైసలు, చెరుకు ముక్కలు, చాక్ లేట్లు కలిపి పసిపిల్లలను ఎవరి ఒడిలోనైనా కూర్చోపెట్టి తలమీదుగా జారుతూ భోగి పళ్ళు పోస్తారు.

మరునాడు సంక్రాంతి పండుగ. ఇదే మకర సంక్రాంతి.
ఇది ముఖ్యంగా దీనినే పెద్ద పండుగ అంటారు.
పండిన పంటలు నూర్పుకు వచ్చి, తమ కష్టానికి ప్రతిఫలం లభించిన రైతులు పెద్దయెత్తున ఈ పండగ జరుపుకుంటారు.
ఇళ్ళముందు ముదితలు, ఆడ పిల్లలు పేడ నీళ్ళతో కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
పగటి పూడ గాలిపటాల (పతంగుల) పండగ ఉంటుంది. ఇళ్ళలో బొమ్మల కొలువులు పెడతారు.
హరిదాసులు ఇంటింటికీ తిరిగి రావమ్మా మహాలక్షి రావమ్మ అని పాడుతుంటారు.

కనుమును పశువుల పండుగ అని కూడ అంటారు.
రైతులు గంగిరెద్దులను అలంకరించి ప్రతి యింటికి పోయి అయ్యవారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు అని సన్నాయి వాయిస్తూ గృహస్థుల నుండి బియ్యం, కానుకలు గ్రహిస్తారు.
ఆవిధంగా సంక్రాంతి పండుగను మీరందరు ఆనందంగా జరుపుకోవాలని నా ఆకాంక్ష.

happy sankranti

ఉషోదయం
తెలతెలవారుతున్న తొలిసంధ్య వేళలో
అంధకారబంధురమయిన ఆకాశం తొలి వెలుగులు సంతరించుకుంటున్న వేళ
ప్రకృతి ఒళ్ళు విరుచుకుని దిగ్గున లేచిన తరుణంలో
పక్షుల కిలకిలారవములు ఉషస్సుకు స్వాగతం పలుకుతూ
నవనవోన్మేషమయిన ఉదయానికి తెర తీస్తూ
బాలభానుడు తన కిరణాలతో లోకానికి వెలుగునిచ్చు వేళ
పల్లె పడుచులు బిందెలతో నదీమ తల్లుల వద్దకు నీళ్ళ కోసం పరుగులిడుతున్న వేళ
చెట్లకు వున్న మొగ్గలు పువ్వులై అరవిరిసిన వేళ
నెమళ్ళు పురివిప్పి ఆడటానికి సిద్ధమవుతున్న వేళ

స్వామి పూజకు సన్నద్ధమవుతున్న పూజారుల హడావుడి
కాయకష్టము చేసుకునే బడుగులు జీవుల పోరాటం
సంధ్యావందనాది నిత్యాదికాలకు బ్రాహ్మణోత్తములు సమాయత్తమవుతున్న తరుణం
పసిపాపల కేరింతలు లోగిళ్ళలో ఆనందాన్నిచ్చు వేళ
ముంగిట కళ్ళాపి చల్లి ముగ్గుల రంగవల్లులు తీర్చిద్దికునే వేళ
ఉషోదయానికి సుస్వాగతం సోదరసోదరీమణులార శుభోదయం ||

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం

తతో యుద్ధ పరి శ్రాన్త౦ సమరే చింత యాస్తితం …..అని వాల్మీకి పలికినాడు.

ఆదిత్య హృదయానికి వేదిక రామ రావణ యుద్ధ ఘట్టము. రావణుడు మహా శక్తి, బల, మంత్ర,సంపన్నుడు. కేవలం స్త్రీలోలత్వమనే దుర్గుణము వీటన్నిటినీ మాయలా కప్పివేసి పెడదారి పట్టించింది, మరి రాముడో? రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి మూర్తి రాముడు. ఇంతటి యోధులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుగా నిలిచి పోరు సల్పితే? . ఇక్కడ యుద్ధం ధర్మం అధర్మం మధ్య. ఈ పరిస్థితి మనకు ప్రతిరోజూ మన మనసులో, కుటుంబంలో, సమాజంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి అటువంటి క్లిష్టమైన సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తాము? చింత, క్రోధము లేదా పరాక్రమము మొదలైన మార్పులను మనం బాహ్యంగా ప్రదర్శిస్తాము. అదే మానవ స్పందనను రాముడు ఒక రోజు యుద్ధము ముగిసిన పిమ్మట ప్రదర్శిస్తాడు. కొంత అలసట, ప్రత్యర్ధిని ఎలా ఓడించాలన్న చింత రామునిలో చూసి అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని రామున్ని అడ్డం పెట్టుకొని ఈ మానవాళికి చెప్పినాడు. అగస్త్యుడు విద్యామండల రుషి కావున బ్రహ్మ రూపమైన ఆదిత్యని స్తోత్రమును మనకు శ్రీరాముని ద్వారా అందించినాడు. బ్రహ్మ దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్న రావణుడి వైభవానికి అడ్డుకట్ట వెయ్యాలంటే భగవనుదనుగ్రహం రామునికి తప్పక ఉండాలి అని భావించి అగస్త్య మహర్షి ఈ మహా మంత్రాన్ని ఉపదేశి౦చినాడు.
రామ రావణ యుద్ధం చూసేందుకు దేవతలంతా వచ్చి ఆకాశంలో బారులు తీరి ఉన్నారు.భగవానుడైన అగస్త్య మహర్షి కూడా వాళ్ళతో కలసి వచ్చి విను వీధి నుంచి చూస్తూ వున్నాడు. రాముడు యుద్ధం చేసి బాగా అలసి పోయి వుండటం చూశాడు. రాముడు రావణునితో ఏ విధముగా యుద్ధం చేయాలో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు … “ ఓ రామా!యుద్ధాల్లో సమస్తమైన శత్రువుల్ని జయించేందుకు ఒక రహస్యమైన స్తోత్రము ఉన్నది.దాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ స్తోత్రాన్ని జపించు, నీవు యుద్దంలో సమస్త శత్రువుల్ని జయించ గలవు. అని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినారు. ఆ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు మూడు సార్లు పఠించగా సూర్య భగవానుడు సంతోషించి రావణ వధ త్వరలో జరుగునని దీవించినాడు. దాంతో శ్రీరాముని ఉత్సాహం రెట్టింపై రావణునితో విజృంభించి యుద్ధం చేశాడు. రామ రావణ యుద్దాన్ని చూసేందుకు దేవతలు, ఋషులు ఆకాశంలో బారులు తీరి శ్రీరామ జయమును కోరుకొంటూ మంగళా శాసనములు పలికినారు.
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేనిత్యమక్షయం పరమం శివం
విషోంతరాదిత్యే హిరణ్మయః…అన్నది శృతి వాక్యం.
పుణ్య మిచ్చే మంత్రమని చెబుతూ, పరలోక ఫలాన్ని ఎత్తి చూపారు. అలాగే “జయావహం” అంటూ ఇహలోక ఫలాన్ని కూడా చూపుతూ ఈ మంత్రం అక్షయ మైనదని చాటి చెప్పారు.
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం.
ఇక్కడ భువనేశ్వరం అని అనడంలో అర్ధం పర బ్రహ్మ౦ అని మనం అర్ధం చేసుకోవాలి. దేవతలు,రాక్షసుల చే పూజింపబడుచుచూ, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ పర బ్రహ్మ౦ అయిన భువనేశ్వరుని పూజించుము. ఎందుకంటే పర బ్రహ్మమే సూర్య,అగ్ని స్వరూపములు అని శృతి చెప్పుచున్నది.
యాభి రాదిత్యస్తపతి రశ్మిభిః తాభి పర్జన్యో వర్షతి (శృతి)
తన కిరణములతో భూమిపై నుండే నీటిని తపింప జేస్తున్నాడో, అదే కిరణములతో మేఘముల ద్వారా వర్షింప జేసి ప్రాణులన్నీ౦టినీ రక్షిస్తున్నాడు.
తన కిరణప్రసారముల చేత లోకాలన్నింటికి వెలుగు ప్రసాదిస్తున్నాడు.
తస్య భాసా సర్వ మిదం విభాతి భాస్కరః … అని ఉపనిషద్వాక్యం.
ముక్కోటి దేవతలు ఉన్నా జీవకోటికి ఆయనే పరమాత్మ, ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష నారాయణ స్వరూపం. ఐశ్వర్య విద్యాప్రదాత అయిన ఆ పర తత్వమే ప్రత్యక్ష నారాయణడుగా లోకాలని పోషిస్తూవున్నాడు.
ఇదే విషయాన్ని శృతి ఏమని చెప్పినదంటే
నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి,
త్వమేవ ప్రత్యక్షం రుద్రోzసి, త్వమేవ ప్రత్యక్షం ఋగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్ష మథర్వాసి, త్వమేవ సర్వం ఛందోzసి.
కార్య సాధనకు, శత్రుంజయమునకు, సర్వ రోగ నివారణకు కొన్ని యుగాలుగా పఠించబడుతున్న మహిమాన్విత స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రం వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో 107 వ సర్గలో అగస్త్యుని నోట రామునికి చెప్పబడింది. రామావతారంలో ఆయన మానవునిగా జన్మ ఎత్తి, ఆ జీవితాన్ని గడుపుతూ, అందులో ఉండే బాధలను అనుభవిస్తూ, అధిగమిస్తూ, ధర్మ పరిపాలన చేస్తూ -వీటిలో భాగంగో ఎందరో మహర్షుల ద్వారా ఉపదేశములు, ఆశేర్వాదములు, సమస్యా పరిష్కరణలు పొందాడు. తానెప్పుడూ దైవ స్వరూపమని చెప్పలేదు, ఆ మహిమలు ప్రదర్శించ లేదు. అందుకనే, రామాయణంలోని ప్రతి అంశము మనకు ఒక దిశానిర్దేశము చేసే సందేశము కలిగి యుంటాయి.
ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు. దైవం కనిపించలేదని ఎవరైనా ఎందుకు బాధపడాలి ?
వేలాదిసంవత్సరములనుంచి వెలుగులు విరజిమ్ముతూ జీవులకు ప్రాణాధారమైన సూర్యభగవానుడు దేవుడే కదా..
శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి అమ్మవారు సూర్యమండలమధ్యస్థ అని పెద్దలు చెబుతున్నారు.
ద్వాదశాదిత్యులకు“మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యోనమః” అని ప్రణామాలు చేస్తుంటాము
యేవ సూర్య జ్యోతిషా బాధసే తమో, జగచ్చ విశ్వముదియర్షి భానునా, తెనాస్మద్విశ్వామనిరామనాహుతి, మపామీవామప దుస్వప్నం సువ (ఋగ్వేదం)
“ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడుస్వప్నాలను మాకు దూరం చేయగలవు”. పై మంత్రం ద్వారా సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది. పన్నెండు రూపాలలో గోచరించే సూర్యుడు రకరకాల వ్యాధులను నయం చేస్తాడని ప్రతీతి. అందుకే ‘ ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ‘ అని అన్నారు.అంటే, ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనమని అర్థం. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం చెబుతుండగా, జ్ఞానం కోసం సూర్యారాధనమని కృష్ణ యుజుర్వేదం పేర్కోంటోంది. సూర్యుడు ఆదిత్యరూపంలో వాత, పిత్త రోగాలను సూర్యరూపంలో కామెర్లరోగాన్ని, సవితృరూపంలో సర్వశస్త్రబాధలను, పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని కలుగజేస్తాడని చెప్పబడుతోంది.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.
అటువంటి సూర్య భగవానునికి చేతులెత్తి నమస్కరిస్తూ
రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

🌿…జై …వీరాంజనేయ… 🌿

🍁…హనుమాన్… లంకాదహనం… 🍁

🌹…ఆ నరుడి బెదిరింపులకీ… ఈ వానరుడి అదిలింపులకీ… రావణుడు భయపడడు… కావాలనే సీతని ఎత్తుకొచ్చాను… నా కంఠంలో ప్రాణం వుండగా సీతని విడుచుపెట్టుట కల్ల… రాముడే వస్తాడో… పరంధాముడు వస్తాడో… రానీ… కోతికి తోకనే అలంకారం గదా… ఆ తోకకి నిప్పంటించండి… లంకా నగరమంతా…తిప్పి… తిప్పి… నగరం బైట వదిలేయండి… అని ఆఙ్ఞాపించాడు రావణుడు…!

🌹…హనుమని రాజ భవనం నుంచి బైటకి తీసుకువచ్చి… అతడి తోకకి గుడ్డలు చుట్టి… నూనెతో బాగా తడిపి నిప్పు ముట్టించారు… ఆపై తప్పెట్లు… తాళాలు… వాయిస్తూ… వేకిలి చేష్టలు చేస్తూ నవ్వసాగారు… వారి కేరింతలు చూస్తుంటే హనుమకి నవ్వోచ్చింది… సీతాన్వేషణ పూర్తీయింది… సీతమ్మ సందేశాన్నీ ఆలకించడమైంది… జానకీ మాతా చూడామణిని స్వీకరించడమైంది… రావణ బలాన్నీ …బలగాన్నీ గమనించడమైంది… ఇక మిగిలింది లంకా దహనమే…!

🍁…జై శ్రీరామ్… సింహనాదం చేస్తూ… బందనాలు త్రెంచుకుంటూ… ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు హనుమ… మరుక్షణం తన వాలాగ్నితో… ఒక్కొక్క భవనాన్నీ అంటిస్తూ… ఆకాశంలో పయనిస్తూ… లంకానగరం చుట్టూ విహరించ సాగాడు… రాక్షసులంతా అర్థనాదాలు చేస్తూ… హాహాకారాలు చేస్తూ తమ తమ నివాసాల్లోంచి బైటకి పరిగెత్తుకి వచ్చి… దిక్కుతోచనట్లు… అటు ఇటు పరుగులు తియ్యసాగారు…! హాహాకారాలు ఏడుపులు… పెడబొబ్బలతో… లంకా నగరం దద్దరిల్లసాగింది… ఆ అగ్ని కార్చిచ్చులా…. లంకని దహించవేస్తోంది…!

🌹…అదే సమయంలో… అస్త్ర శస్త్ర విధ్యా ప్రవీణుడైన శ్రీరామునకు జయం జయం… మహా బలవంతుడైన లక్ష్మణునకు జయం జయం… రాముని చేత కాపాడబడిన మా రాజు సుగ్రీవునకు జయం జయం… అంటూ హనుమ చేస్తున్న గర్జనలు… దగ్దమవుతున్న లంకాపురిలో… దశదిశలా ప్రతిధ్వనించాయి…!

🌿….జై శ్రీరామ్… 🌿

అమ్మ

కనులు తెరిచిన క్షణం కనపడే రూపం అమ్మ,

తన ఆత్మ శరీరం పంచి మనకు జన్మనిచ్చిన దివ్యరూపం అమ్మ.

తన రక్తాన్ని పాలుగా మార్చి మన ప్రాణం నిలుపుతుందిఅమ్మ,

మన కాలిలో ముళ్ళు విరిగిన విలవిల లాడిపోయేది అమ్మ.

మన మౌనం సైతం అర్థం చేసుకోగలదు అమ్మ,

మన ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేయడానికి ఏ మాత్రం వెనకాడదు అమ్మ.

తనవన్నీ త్యాగం చేస్తూ మన ఎదుగుదల కోరుకుంటుంది అమ్మ,

మన పెదవిపై చిరునవ్వు తన గెలుపుగా భావిస్తుంది అమ్మ.

చివరిక్షణం వరకు అనుక్షణం నీకై బ్రతుకుతుంది అమ్మ,

చివరిశ్వాస నిను చూస్తూ నీ చేతుల్లో ఒధగాలని తపించిపోతుంది అమ్మ.

ప్రేమ అనే పదానికి అర్థం అమ్మ,

నీ ప్రేమ అమూల్యం అమ్మ,

నీ ఋణం తీర్చుకోలేనిది అమ్మ….

ఇవి మీకు తెలుసా ?
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

🌿…స్వామియే శరణం అయ్యప్ప… 🌿

 

🍁…స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్…🍁

 

🍁….”ఎరుమేలి “….🍁

 

🍁…శబరిమల యాత్ర… “ఎరుమేలి”తో మొదలవుతుంది… ఎరుమేలిలో… “వావరుస్వామి”ని దర్శించుకుంటారు… అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న ధివ్యస్థలం ఇది. దీనినే “కొట్టెప్పెడి” అని కూడా పిలుస్తారు… మణికంఠునిచే సంహరింపబడ్డ మహిషి…  తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకి విసిరివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి  ఎరుమ అనే పేరు వచ్చింది… కాలక్రమేణా ఎరుమ… “ఎరుమేల” గా మారింది…!

 

🍁…కన్నెమాల గణపతి…🍁

 

🍁…పులిపాల కోసం… అయ్యప్ప అడవికి వెళ్లినపుడు… అతనిని అడ్డగించిన ఒక దొంగ… అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు… అతడే వావరు స్వామి.. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు… ముందుగా నిన్ను దర్శించకుంటారు… అని అయ్యప్ప వావరుకి వరమిచ్చాడటా… ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో… అయ్యప్ప స్వామి దనుర్భాణధారియై ఉంటాడు… ఇక్కడ వినాయకుడు కూడా కూడా కొలువై ఉంటాడు… ఈయనను…  “కన్నెమాల గణపతి ” అని అంటారు… ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు…!

 

🍁…పేటైతలల నాట్యం… 🍁

 

🍁…మహీషితో యుద్దం చేసేటపుడు… అయ్యప్ప స్వామి మహీషి పైకి ఎక్కి చేసిన తాండవం పేరు… “పేటైతలల నాట్యం” అంటారు… వయోభేదాన్ని దాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా… తమ శరీరాలను ఆకులు… కూరగాయలు… పళ్లు రంగు రంగుల కుంకుమలు… బుడగలతో అలంకరించకుంటారు… చెక్కతో చేయబడిన… చాకు… భాణం… గద… బాకు… మొదలైన ఆయుదాలను ధరించి భాజా భజంత్రీలతో… రక రకాల వేషధారణతో… ఊరేగింపుగా స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్ అంటూ… “పేటైతులాలు నాట్యాన్ని” నేటికీ ఆచరిస్తున్నారు…

 

🌿…స్వామియే శరణం అయ్యప్ప… 🌿