Moral Doubts

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:

  • మూలముబ్రహ్మ
  • దాని మధ్య భాగమేవిష్ణువు
  • దాని చివరి భాగము – శివుడు

కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు,అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు,దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో ‘అకారము, మానులో ‘ఉకారము, అదిఇచ్చే పళ్ళలో ‘మకరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.